బీటెక్ విద్యార్థికి రూ.1.31 కోట్ల ప్యాకేజీ.. ప్లేస్‌మెంట్స్‌లో ఏకంగా 83 మందికి భారీ జీతాలు.. | | ACTPnews

News18


Last Updated:

బీటెక్ పూర్తి చేసిన తర్వాత భారీ జీతంతో ఉద్యోగం రావాలంటే ఏ కాలేజీలో చదవాలి? ఈ ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇస్తున్నాయి ఎన్‌ఐటీ రౌర్‌కెలా తాజా ప్లేస్‌మెంట్ గణాంకాలు.

News18
News18

బీటెక్ చదివే విద్యార్థులకు కళాశాల ఎంపికలో ప్లేస్‌మెంట్స్‌ కీలకంగా మారుతున్నాయి. చదువు పూర్తయ్యాక ఎలాంటి ఉద్యోగం, ఎంత వేతనం లభిస్తుందనే అంశాలను విద్యార్థులు ముందుగానే పరిశీలిస్తున్నారు. సాధారణంగా భారీ వేతన ప్యాకేజీల విషయానికి వస్తే ఐఐటీల పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. అయితే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) రౌర్‌కెలా కూడా తాజా ప్లేస్‌మెంట్ ఫలితాల్లో మంచి గణాంకాలను నమోదు చేసింది. ఈసారి ఒక బీటెక్ విద్యార్థికి ఏకంగా రూ.1.31 కోట్ల వార్షిక ప్యాకేజీ లభించింది.

సగటు ప్యాకేజీ రూ.15.33 లక్షలు

ఎన్‌ఐటీ రౌర్‌కెలా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ప్లేస్‌మెంట్ సీజన్‌లో విద్యార్థులకు లభించిన అత్యధిక వార్షిక ప్యాకేజీ రూ.1.31 కోట్లు. అదే సమయంలో విద్యార్థుల సగటు వార్షిక ప్యాకేజీ రూ.15.33 లక్షలుగా నమోదైంది. మధ్యస్థ వేతనం రూ.12.50 లక్షలుగా ఉంది. మరోవైపు 83 మందికి పైగా విద్యార్థులు ఏడాదికి రూ.30 లక్షలకుపైగా వేతనం అందించే ఉద్యోగాలను సాధించారు. దీంతో భారీ ప్యాకేజీల విషయంలోనూ ఎన్‌ఐటీ రౌర్‌కెలా విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు.

95.47 శాతం ప్లేస్‌మెంట్

బీటెక్ ప్రోగ్రామ్‌కు ఈసారి 95.47 శాతం ప్లేస్‌మెంట్ రేటు నమోదైంది. అంటే ప్లేస్‌మెంట్స్‌కు హాజరైన ప్రతి 100 మంది విద్యార్థుల్లో సుమారు 95 మందికి ఉద్యోగ ఆఫర్లు వచ్చినట్లు లెక్క. మొత్తం 1,340 ఉద్యోగ ఆఫర్లు విద్యార్థులకు లభించాయి. వీటితో పాటు 364 మంది విద్యార్థులకు ఆరు నెలల ఇంటర్న్‌షిప్ అవకాశాలు దక్కాయి. ప్రీ-ఫైనల్ ఇయర్ విద్యార్థులకు 258 సమ్మర్ ఇంటర్న్‌షిప్ ఆఫర్లు కూడా వచ్చాయి.

374 కంపెనీల భాగస్వామ్యం

ఈసారి క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో మొత్తం 374 కంపెనీలు పాల్గొన్నాయి. ఇందులో దాదాపు సగం సంస్థలు తొలిసారిగా ఎన్‌ఐటీ రౌర్‌కెలా ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొన్నట్లు ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. సాఫ్ట్‌వేర్, ఐటీ రంగాల నుంచి అత్యధిక సంఖ్యలో కంపెనీలు వచ్చాయి. ఆ తర్వాత తయారీ, బ్యాంకింగ్-ఫైనాన్స్, ఎలక్ట్రానిక్స్, విద్యా రంగాలకు చెందిన సంస్థలు క్యాంపస్‌కు వచ్చాయి.

పలు విభాగాల్లో ఉద్యోగాలు

విద్యార్థులకు వివిధ రకాల ఉద్యోగాల కోసం ఆఫర్లు లభించాయి. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్, హార్డ్‌వేర్ ఇంజనీర్, గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజనీర్, డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ వంటి పోస్టులు ఇందులో ఉన్నాయి. మొత్తం ఉద్యోగ ఆఫర్లలో సుమారు 41.69 శాతం కోర్ సెక్టార్‌కు సంబంధించినవే కావడం మరో ముఖ్యాంశం.

నెలకు రూ.1.50 లక్షల ఇంటర్న్‌షిప్ స్టైపెండ్

ఇంటర్న్‌షిప్స్‌లోనూ విద్యార్థులకు మంచి అవకాశాలు దక్కాయి. ఇంజినీరింగ్ విద్యార్థులకు లభించిన అత్యధిక ఇంటర్న్‌షిప్ స్టైపెండ్ నెలకు రూ.1.50 లక్షల వరకు చేరింది. విద్యార్థుల కృషితో పాటు ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కెరీర్ డెవలప్‌మెంట్ సెంటర్ కూడా ఈ ప్లేస్‌మెంట్ ఫలితాల్లో కీలక పాత్ర పోషించినట్లు ఎన్‌ఐటీ రౌర్‌కెలా పేర్కొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed