భారత్-న్యూజిలాండ్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం.. అక్టోబర్ 20 నుంచి అమలు.. ఈ రంగాలకు జాక్‌పాట్! | | ACTPnews

News18


Last Updated:

భారత్, న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) లాంఛనాలు పూర్తయ్యాయి. న్యూజిలాండ్ పార్లమెంట్ దీనికి ఆమోదం తెలిపింది. ఈ చారిత్రాత్మక ఒప్పందం విజయదశమి పండుగ సందర్భంగా అక్టోబర్ 20 నుంచి అధికారికంగా అమలు కానుంది.

News18
News18

భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య సుదీర్ఘంగా సాగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ప్రక్రియ ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఇరు దేశాల మధ్య చారిత్రాత్మకమైన ఈ కీలక ఒప్పందానికి న్యూజిలాండ్ పార్లమెంట్ లాంఛనంగా ఆమోదముద్ర వేసింది. దీంతో రెండు దేశాల మధ్య ఒప్పందం పూర్తిగా ఖరారైనట్లు న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ అధికారికంగా ప్రకటించారు. గత ఎన్నికల సమయంలో తాము ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అయితే లాంఛనాలు అన్నీ ఇప్పుడు పూర్తయినప్పటికీ, ఈ ఒప్పందం ప్రకారం పన్నుల రద్దు, వీసాల మంజూరు లాంటి అసలైన ప్రయోజనాలు విజయదశమి పండుగను పురస్కరించుకుని వచ్చే నెల అనగా అక్టోబర్ 20 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.

“ఇది రెండు దేశాలు సాధించిన గొప్ప విజయం” అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల ఎగుమతిదారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయని, వ్యాపారాల వృద్ధికి, కొత్త ఉద్యోగాల కల్పనకు ఇది తోడ్పడుతుందని లక్సన్ వివరించారు.

పన్నుల్లేని ఎగుమతులు

ఈ సరికొత్త ఒప్పందం అమల్లోకి వస్తే న్యూజిలాండ్‌కు వెళ్లే నూరు శాతం భారతీయ ఎగుమతులపై ఎలాంటి సుంకం (ట్యాక్స్) ఉండదు. దీనివల్ల మన దేశంలోని జౌళి, దుస్తులు, తోలు ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ రంగాలకు భారీ లబ్ధి చేకూరుతుంది. భవిష్యత్తులో ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా వచ్చే 15 ఏళ్లలో భారత్‌లో సుమారు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు న్యూజిలాండ్ అంగీకరించింది. మన దేశ రైతులు, పాడి పరిశ్రమను రక్షించుకునేందుకు వ్యవసాయం, చక్కెర, కొన్ని లోహాలను ఈ ఒప్పందం నుంచి మినహాయించారు.

భారతీయులకు కొత్త వీసాలు

వ్యాపారాలతో పాటే భారతీయ విద్యార్థులు, నిపుణులకు ఈ ఒప్పందం సరికొత్త అవకాశాలు కల్పిస్తోంది. తాత్కాలిక ఉపాధి వీసా కింద ఏటా 5,000 మంది నైపుణ్యం కలిగిన భారతీయులకు మూడేళ్ల పాటు న్యూజిలాండ్‌లో ఉండేందుకు వెసులుబాటు దక్కుతుంది. ఐటీ, ఇంజనీరింగ్, యోగా, ఆయుష్ నిపుణులు ఈ జాబితాలో ఉంటారు. అలాగే ‘వర్కింగ్ హాలిడే వీసా’ విధానం కింద ఏటా మరో 1,000 మంది యువత ఏడాది పాటు అక్కడ పర్యటించే అవకాశం దక్కించుకుంటారు.

ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులకు కూడా

ఈ ఒప్పందం వరంగా మారనుంది. అర్హత కలిగిన విద్యార్థులు చదువుకుంటూనే వారానికి 20 గంటల పాటు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకోవచ్చు. చదువు పూర్తయిన తర్వాత వర్క్ వీసాలను పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలా అక్టోబర్ 20 నుంచి ఈ ప్రయోజనాలన్నీ నేరుగా ప్రజలకు, వ్యాపారులకు అందుబాటులోకి రానున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed