శ్రీరామ్ హీరోగా ఔట్ స్టాండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.. ‘ది మేజ్’ ఫస్ట్ లుక్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటిస్తున్న కొత్త సినిమా “ది మేజ్”. ఈ మూవీలో ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

News18
News18

తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటిస్తున్న కొత్త సినిమా “ది మేజ్”. ఈ మూవీలో ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని డాక్టర్ నైమిష రెడ్డి కసిరెడ్డి సమర్పణలో శ్రౌష కమల ఆర్ట్స్, యూఆర్ క్రియేషన్స్ బ్యానర్స్ పై డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్ఆర్ (కరెడ్డి శ్రీధర్ రెడ్డి), డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ నిర్మిస్తున్నారు. “ది మేజ్” చిత్రాన్ని సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గడలాయ్ రూపొందిస్తున్నారు.

ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో లీడ్ యాక్టర్స్ ఇంటెన్స్ లుక్స్ లో కనిపిస్తుండగా, వారి బ్యాక్ డ్రాప్ లో ఒక మహానగరాన్ని చూపించారు. లీడ్ యాక్టర్స్ అంతా బ్లాక్ కాస్ట్యూమ్స్ లో ఉండటం ఆసక్తి కలిగిస్తోంది. న్యూ ఏజ్ కమర్షియల్ థ్రిల్లర్ మూవీని చూడబోతున్నామనే ఇంప్రెషన్ “ది మేజ్” ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఏర్పడుతోంది.

“ది మేజ్” సినిమా గురించి దర్శకుడు డాక్టర్ డాక్టర్ రవికిరణ్ గడలాయ్ మాట్లాడుతూ – వాస్తవం–భ్రమ మధ్యనున్న సరిహద్దులను చెరిపేస్తూ, ప్రతి క్షణం మీ ఆలోచనలను సవాలు చేసే, జెయింట్ వీల్ ప్రయాణం లాంటి ఉత్కంఠభరితమైన సైకలాజికల్ థ్రిల్లర్ గా మా సినిమాను రూపొందిస్తున్నాం. చివరి క్షణం వరకు తర్వాత ఏం జరుగుతుంది అనేది ఊహించలేని విధంగా తెరకెక్కించిన మా సినిమా కథలోని ప్రతి మలుపు ఆసక్తి రేపుతుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా కాలం మనసులో నిలిచిపోయే అనుభూతిని కలిగిస్తుంది. అన్నారు. ఈ సినిమాలో శ్రీరామ్ (శ్రీకాంత్), ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports