418 Movie: హార్రర్ థ్రిల్లర్ ‘418’ మూవీ ట్రైలర్ అప్‌డేట్.. రిలీజ్ ఎప్పుడంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

టాలీవుడ్‌లో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. కథలో భయం, ఉత్కంఠ, మిస్టరీని మిక్స్ చేస్తూ ప్రేక్షకులను థ్రిల్ చేసే సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఇప్పుడు అదే తరహాలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న చిత్రం ‘418’.

News18
News18

టాలీవుడ్‌లో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. కథలో భయం, ఉత్కంఠ, మిస్టరీని మిక్స్ చేస్తూ ప్రేక్షకులను థ్రిల్ చేసే సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఇప్పుడు అదే తరహాలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న చిత్రం ‘418’. ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొనగా.. తాజాగా మేకర్స్ ఇచ్చిన అప్‌డేట్ మరింత క్యూరియాసిటీని పెంచింది.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ‘418’ చిత్రం తెరకెక్కుతోంది. కీర్తన్ నాగగౌడ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రీతి పగడాల ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాకు బ్లాక్‌బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రశాంత్ నీల్ వంటి స్టార్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుంచే అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ‘418’ సినిమాను ముందుగా సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. అయితే మేకర్స్ సినిమాను కేవలం ఒక భాషకు పరిమితం చేయకుండా మరింత గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. ఈ నేపథ్యంలో విడుదల తేదీని వాయిదా వేసినట్లు ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాను ప్రేక్షకులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

తాజాగా ‘418’ సినిమాకు సంబంధించి మరో కీలక అప్‌డేట్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో సినిమా పరిధి మరింత విస్తరించనుంది. ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ జానర్ కావడంతో మూడు భాషల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను రూపొందించినట్లు మేకర్స్ చెబుతున్నారు.

అయితే విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌తో పాటు ఇప్పుడు అందరి దృష్టిని ట్రైలర్‌పైకి మళ్లించారు. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా ‘భయం మీ తలుపు తట్టడానికి సిద్ధంగా ఉంది’ అంటూ ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌తో ట్రైలర్ అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ ఒక్క లైన్‌తోనే సినిమా ఎలాంటి హారర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతుందనే ఆసక్తి మొదలైంది.

‘418’ మోస్ట్ అవైటెడ్ ట్రైలర్‌ను అక్టోబర్ 5న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ఉదయం 11:07 గంటలకు ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌లో కథకు సంబంధించిన ఎలాంటి అంశాలను చూపించబోతున్నారు? సినిమాలోని హారర్ ఎలిమెంట్స్ ఎలా ఉండబోతున్నాయి? ప్రీతి పగడాల పాత్ర ఎలా ఉండబోతోంది? అనే విషయాలపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

ప్రశాంత్ నీల్ సమర్పణలో వస్తున్న సినిమా కావడంతో ‘418’పై సహజంగానే అంచనాలు పెరిగాయి. ఇక ట్రైలర్ విడుదల తర్వాత సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మూడు భాషల్లో ఒకేసారి విడుదలకు సిద్ధమవుతున్న ఈ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతవరకు భయపెడుతుందో చూడాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *