72 National Awards: సుకుమార్ నుంచి నిహారిక వరకు.. నేషనల్ అవార్డులు అందుకున్న తెలుగు విజేతలు వీళ్లే! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

72 National Awards: సుకుమార్ నుంచి నిహారిక వరకు.. నేషనల్ అవార్డులు అందుకున్న తెలుగు విజేతలు వీళ్లే! | తెలుగు సినిమా వార్తలు


ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా జాతీయ అవార్డుల్లో ప్రత్యేక గుర్తింపు లభించింది. ‘పుష్ప 2’ సినిమాకు గాను దర్శకుడు సుకుమార్ బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్ అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని స్వీకరించారు. ఇదే సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్లుగా సీతల్, దీపాలే అవార్డు అందుకున్నారు. అదే విధంగా ‘లక్కీ భాస్కర్’ సినిమాతో మరో తెలుగు దర్శకుడు జాతీయ అవార్డు అందుకున్నారు. వెంకీ అట్లూరి ఈ సినిమాకు గాను బెస్ట్ డైలాగ్ రైటర్ అవార్డును స్వీకరించారు.

ఇక ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’కి కూడా జాతీయ అవార్డుల వేదికపై పురస్కారం దక్కింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డు లభించింది. అదే విధంగా ఇదే సినిమాకు బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డును నితిన్ బిహాని తీసుకున్నాడు.

తెలుగు చిత్ర పరిశ్రమకు మరో ఘనత ‘కమిటీ కుర్రోళ్లు’ రూపంలో దక్కింది. నిహారిక కొణిదెల నిర్మించిన ఈ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం లభించింది. గ్రామీణ నేపథ్యంలో స్నేహం, రాజకీయాలు, యువత జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందిన ఈ సినిమా జాతీయ స్థాయిలో తెలుగు చిత్రంగా గుర్తింపు పొందింది. అదే విధంగా ’35 చిన్న కథ కాదు’ ఉత్తమ బాలల చిత్రంగా అవార్డు అందుకున్నారు. ఈ సినిమాలో నటించిన పోతుల అరుందేవ్ ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందుకున్నాడు.

ఉత్తమ నటుడిగా మమ్ముట్టి, కార్తిక్ ఆర్యన్:

ఈ ఏడాది ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు నటులు పంచుకున్నారు. ‘భ్రమయుగం’ సినిమాలో తన నటనకు మమ్ముట్టి, ‘చందూ ఛాంపియన్’ సినిమాలో తన పాత్రకు కార్తిక్ ఆర్యన్ ఉత్తమ నటుడి పురస్కారాలను అందుకున్నారు. ఇద్దరి నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. మరోవైపు ‘ఆర్టికల్ 370’ సినిమాలో నటనకు యామి గౌతమ్ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు. ఇదే సినిమాకు ఉత్తమ చిత్రంగా కూడా జాతీయ పురస్కారం లభించింది. ‘ఆర్టికల్ 370’ చిత్రానికి ఆదిత్య సుహాస్ జంబాలే దర్శకత్వం వహించారు.

ఉత్తమ దర్శకుడిగా ‘అమరన్’ దర్శకుడు:

‘అమరన్’ సినిమాతో దర్శకుడు రాజ్‌కుమార్ పెరియాసామి ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు. శివ కార్తికేయన్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందింది. ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకత్వ పురస్కారం లభించడం విశేషంగా మారింది.

ఇతర విభాగాల్లోనూ పలువురికి పురస్కారాలు:

ఉత్తమ సహాయ నటి విభాగంలో ‘మహారాజ’ సినిమాకు సచన నమిదాస్, ‘మిథ్య’ సినిమాకు రూపశ్రీ వర్కాడే అవార్డులను అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా ‘భక్షక్’ సినిమాలోని తన నటనకు సంజయ్ మిశ్రా పురస్కారం అందుకున్నారు. ఈ చిత్రానికి నంద కిశోర్ దర్శకత్వం వహించారు. అలాగే ఉత్తమ జాతీయ, విలువల చిత్రంగా ‘కెప్టెన్ మిల్లర్’ ఎంపికైంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఈ పురస్కారం దక్కింది. ఇక ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌గా రణ్‌దీప్ హుడా ఎంపికయ్యాడు. ‘స్వాతంత్ర్య వీర్ సావర్కర్’ సినిమాను తెరకెక్కించినందుకు ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

72వ జాతీయ అవార్డుల విజేతలు:

ఉత్తమ నటుడు: మమ్ముట్టి – ‘భ్రమయుగం’

ఉత్తమ నటుడు: కార్తిక్ ఆర్యన్ – ‘చందూ ఛాంపియన్’

ఉత్తమ నటి: యామి గౌతమ్ – ‘ఆర్టికల్ 370’

ఉత్తమ చిత్రం: ‘ఆర్టికల్ 370’ – ఆదిత్య సుహాస్ జంబాలే

ఉత్తమ దర్శకుడు: రాజ్‌కుమార్ పెరియాసామి – ‘అమరన్’

ఉత్తమ సహాయ నటి: సచన నమిదాస్ – ‘మహారాజ’

ఉత్తమ సహాయ నటి: రూపశ్రీ వర్కాడే – ‘మిథ్య’

ఉత్తమ సహాయ నటుడు: సంజయ్ మిశ్రా – ‘భక్షక్’

ఉత్తమ బాలల చిత్రం: ‘చిన్న కథ కాదు’ – నంద కిశోర్

ఉత్తమ జాతీయ, విలువల చిత్రం: ‘కెప్టెన్ మిల్లర్’ – అరుణ్ మాథేశ్వరన్

ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: ‘కల్కి 2898 ఏడీ’ – నాగ్ అశ్విన్

ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: రణ్‌దీప్ హుడా – ‘స్వాతంత్ర్య వీర్ సావర్కర్’

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో తెలుగు సినిమాలకు పలు విభాగాల్లో పురస్కారాలు దక్కడం టాలీవుడ్‌కు ప్రత్యేకమైన ఘనతగా నిలిచింది. సుకుమార్, వెంకీ అట్లూరి, నాగ్ అశ్విన్, నిహారిక కొణిదెలతో పాటు పలువురు తెలుగు సినీ ప్రముఖులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. భారతీయ సినిమా రంగంలోని వివిధ భాషలకు చెందిన ప్రతిభావంతులను ఒకే వేదికపై సత్కరించిన ఈ వేడుకతో 2024 సంవత్సరానికి సంబంధించిన జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం పూర్తవుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed