Last Updated:
Malla Reddy Controversy: చామకూర మల్లారెడ్డి దశాబ్ధకాలం క్రితం తెలంగాణ ప్రజలకు ఈ పేరు వినడమే కాని పెద్దగా ముఖపరిచయం లేని వ్యక్తి. వ్యాపారవేత్త, విద్యావేత్త, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే ఒకటి కాదు అన్నీ రకాలుగా ఇప్పుడు సుపరిచితులు. అంతే కాదు టీడీపీ, బీఆర్ఎస్ పార్టీల్లో కీలకనేతగా తనదైన ఊర మాస్ డైలాగులతో నవ్వించే పొలిటికల్ కమెడియన్గా ఒక్క డైలాగ్తో సోషల్ మీడియా పాపులర్ పర్సనాలిటీగా ఫేమస్ అయ్యారు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.













