Last Updated:
Toxic Movie Twitter Review: యష్ డ్యూయల్ రోల్‌లోని తండ్రి పాత్ర బలంగా నిలుస్తోందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దర్శకురాలు గీతు మోహన్‌దాస్ విజువల్ స్టైల్, యష్ సహ రచన కలిసి కొత్త రకం గ్యాంగ్‌స్టర్ కథను అందించినట్లు కనిపిస్తోంది.
యష్ నటించిన టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ నేడు (ఆగస్టు 26) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత నాలుగేళ్ల విరామం తర్వాత వచ్చిన ఈ చిత్రంపై ఆసక్తి చాలా ఎక్కువగా ఉంది. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా గోవా బ్యాక్‌గ్రౌండ్‌లో 1940ల నుంచి 1970ల వరకు సాగుతుంది. యష్ రాయా (తండ్రి), టికెట్/రూమీ (కొడుకు)గా డబుల్ పాత్రల్లో కనిపించాడు. కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి నటీమణులు కీలక పాత్రల్లో ఉన్నారు. సినిమా సుమారు 3 గంటల 14 నిమిషాలు నడుస్తోంది. సెన్సార్ ప్రకారం ‘A’ సర్టిఫికేట్ పొందింది.














