Rahul Gandhi: 29 అబద్ధాలు.. 11 తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు.. విద్యార్థుల సభల్లో రాహుల్ ప్రసంగాలపై సంచలన నివేదిక! | | ACTPnews

PC: X.com


Last Updated:

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల విద్యార్థుల సభల్లో చేసిన ప్రసంగాలపై ఓ ఫ్యాక్ట్-చెకింగ్ వెబ్‌సైట్ సంచలన నివేదికను విడుదల చేసింది.

PC: X.com
PC: X.com

జూన్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో కోటా, డెహ్రాడూన్, ప్రయాగ్‌రాజ్, పూణేలలో నిర్వహించిన ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ చేసిన 40 ప్రకటనల్లో.. 29 పూర్తిగా అవాస్తవాలని, మరో 11 ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ‘ఝూట్ కీ గూంజ్’ అనే వెబ్‌సైట్ పేర్కొంది. జెన్-జీ (Gen Z) క్రియేటర్ రూపొందించిన ఈ ఫ్యాక్ట్-చెకింగ్ పోర్టల్ విశ్లేషణ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ అధికారిక గణాంకాలతో సహా మొత్తం 134 విశ్వసనీయ ఆధారాలను పరిశీలించి ఈ నివేదికను రూపొందించినట్లు సదరు వెబ్‌సైట్ స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగం, విద్యావ్యవస్థ, నేరాల నమోదు తదితర కీలక అంశాలపై రాహుల్ గాంధీ మాట్లాడిన విషయాలను ఇందులో విశ్లేషించారు. రిక్రూట్‌మెంట్ గణాంకాలు, తాజా సర్వే డేటాను ఉపయోగించి రాహుల్ చెప్పిన ఉద్యోగార్థుల సంఖ్య, నమోదుకాని లైంగిక దాడుల కేసుల లెక్కలను ఈ వెబ్‌సైట్ తోసిపుచ్చింది. యువతలో జవాబుదారీతనం పెంచే సాధనంగా నెటిజన్లు ఈ పోర్టల్ లింక్‌ను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా పంచుకుంటున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed