Last Updated:
శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ముగ్గురు కోతులు’. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు.
జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో స్కై ఫ్లేర్ నెట్వర్క్స్ సహ సమర్పణలో శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ముగ్గురు కోతులు’. ఈ మూవీలో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ముఖ్య పాత్రల్ని పోషిస్తుండగా.. వర్షిక పాశం హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి రీసెంట్గా టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.














