India vs Pakistan: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. 56 పరుగుల లక్ష్యాన్ని ఊదిపడేసిన టీమిండియా! | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

మహిళల ఆసియా కప్‌లో టీమిండియా అదరగొట్టింది. పాకిస్థాన్ నిర్దేశించిన 56 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించి, దాయాది జట్టుపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

News18
News18

మహిళల ఆసియా కప్‌లో భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ హైవోల్టేజ్ పోరులో పాక్ నిర్దేశించిన 56 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. దీంతో దాయాది జట్టుపై 7 వికెట్ల తేడాతో తిరుగులేని విజయాన్ని అందుకుంది. అంతకుముందు మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్.. భారత బౌలర్ల ధాటికి 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులకే కుప్పకూలింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports