Last Updated:
Trigun Bigg Boss Telugu 10: ‘కథ’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, ‘పిఎస్వి గరుడ వేగ’, ‘కొండా’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న త్రిగుణ్ ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 10లో 2వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. అదిత్ అరుణ్ నుంచి త్రిగుణ్‌గా పేరు మార్చుకున్న ఆయన సినీ ప్రయాణం, నేపథ్యం, బిగ్ బాస్ హౌస్‌లో గేమ్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.
Trigun Bigg Boss Telugu 10: తెలుగు, తమిళ చిత్రసీమల్లో విలక్షణ కథానాయకుడిగా, సహాయ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అదిత్ అరుణ్ అలియాస్ త్రిగుణ్. చాక్లెట్ బాయ్ లుక్స్‌తో కెరీర్ మొదలుపెట్టి, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఈ యంగ్ హీరో.. ప్రస్తుతం ‘బిగ్ బాస్’ సరికొత్త సీజన్లో 2వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన నేపథ్యం, సినీ ప్రయాణానికి సంబంధించిన పూర్తి వివరాలు..














