Tamilnadu: ప్రియుడికి బైక్ గిఫ్ట్ ఇవ్వాలని క్లోజ్ ఫ్రెండ్‌ను మోసం చేసిన యువతి.. చివరకు అరెస్ట్! | | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

Tamilnadu: ప్రియుడి మోజులో పడి, అతడి కోరిక తీర్చేందుకు ఓ కళాశాల విద్యార్థిని నేర మార్గాన్ని ఎంచుకుంది. తనను ప్రాణంగా నమ్మిన ప్రాణస్నేహితురాలి ఇంట్లోనే భారీ చోరీకి పాల్పడి కటకటాలపాలైంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రియుడికి ఖరీదైన ద్విచక్ర వాహనం (బైక్) కొనివ్వడం కోసమే ఏకంగా 9 సవర్ల బంగారు ఆభరణాలను కాజేసిన ఈ విచిత్ర ఉదంతం తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లా పొల్లాచ్చి పరిసరాల్లో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… కోయంబత్తూర్ జిల్లా పొల్లాచ్చి ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువతి స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (బీకాం) రెండో సంవత్సరం చదువుతోంది. ఈమె అదే కళాశాలలో చదువుతున్న మరో విద్యార్థినితో అత్యంత సన్నిహితంగా ఉండేది. రోజూ కళాశాలకు కలిసి వెళ్లడం, ఒకరి ఇంటికి మరొకరు రావడం వీరికి అలవాటుగా ఉండేది. ఈ క్రమంలో నిందితురాలు గత ఆగస్టు 16వ తేదీన తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *