KTR vs Congress: రాహుల్ గాంధీ నల్ల షర్టుతో పార్లమెంట్‌కి వెళ్లవచ్చా, మేం అసెంబ్లీకి వస్తే తప్పా.. కాంగ్రెస్ కపట వైఖరిపై KTR ఫైర్ | తెలంగాణ వార్తలు | ACTPnews

BRS vs Congress


Last Updated:

BRS vs Congress: కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానాలపై, వాగ్దానాలు, 22 A అంశంపై ప్రతిపక్ష పార్టీలతో చర్చించడానికి భయపడే కేసుల పేరుతో రాజకీయం చేస్తోందని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ బెదిరింపులకు, తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు పరిణామాలను ఉద్దేశించి సోషల్ మీడియా ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.

BRS vs Congress
BRS vs Congress

BRS vs Congress: కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానాలపై, వాగ్దానాలు, 22 A అంశంపై ప్రతిపక్ష పార్టీలతో చర్చించడానికి భయపడే కేసుల పేరుతో రాజకీయం చేస్తోందని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ బెదిరింపులకు, తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు పరిణామాలను ఉద్దేశించి సోషల్ మీడియా ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. నిరసన తెలుపుతూ నల్ల టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే మెయిన్ గేటు దగ్గరే అడ్డుకోవడం, నెట్టివేయడం, మహిళా ప్రజాప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, కేసులు పెట్టడం వంటి అంశాలతో పాటు నల్ల టీషర్ట్ వేసుకుంటే సభలోకి అనుమతి లేదని స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎన్డీఏ పాలనతీరును నిరసిస్తూ కాంగ్రెస్ శాసనసభాపక్షనేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంగాంధీ నల్ల టీషర్టులు వేసుకొని హాజరైన ఫోటోని ట్విట్టర్‌లో షేర్ చేశారు. పార్లమెంట్‌లో రాహుల్ గాంధీకి ఏది సరైనదో అది తెలంగాణ అసెంబ్లీలో మాకు తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ చేస్తున్నది కపటమేనా అంటూ చురకలంటించారు కేటీఆర్.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed