Britain ATC: బ్రిటన్ ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థ క్రాష్.. ఆకాశంలో నిలిచిన ప్రయాణాలు.. ప్రయాణికుల తీవ్ర అవస్థలు! | | ACTPnews

PC: X.com


Last Updated:

Britain ATC: బ్రిటన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా దేశవ్యాప్తంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

PC: X.com
PC: X.com

మంగళవారం ఒక్కరోజే యూకే విమానాశ్రయాల్లో 1,000కి పైగా విమానాలు రద్దయినట్లు ప్రముఖ ఫ్లైట్ ట్రాకింగ్ పోర్టల్ ‘ఫ్లైట్‌రాడార్24’ (Flightradar24) వెల్లడించింది. బ్రిటన్ నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ (NATS) తమ ఫ్లైట్ ప్రాసెసింగ్ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు గుర్తించింది. ఈ సమస్య పరిష్కారానికి ఇంజనీర్లు అత్యవసరంగా రంగంలోకి దిగారు. లండన్ హీత్రూ సహా ప్రధాన ఎయిర్‌పోర్టులకు రాకపోకలు సాగించాల్సిన కనీసం 1,000 విమానాలు రద్దయ్యాయి. బ్రిటిష్ ఎయిర్‌వేస్, ఈజీజెట్, కేఎల్‌ఎం, లుఫ్తాన్సా వంటి ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ సేవలపై ఈ ప్రభావం భారీగా పడింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports