Last Updated:
Hyderabad power demand: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్తు వినియోగం మునుపెన్నడూ లేని సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
సాధారణంగా వర్షాకాలం మొదలుకాగానే వాతావరణం చల్లబడి విద్యుత్తు వాడకం భారీగా తగ్గుముఖం పట్టడం సహజం. అయితే అందుకు పూర్తి భిన్నంగా, చరిత్రలోనే తొలిసారిగా వానాకాలంలో కూడా విద్యుత్తు డిమాండ్ వేసవి కాలాన్ని తలపిస్తూ ఆకాశాన్నంటుతోంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడం, పగటి పూట గరిష్ఠంగా 35 డిగ్రీల వరకు నమోదవుతున్న భానుడి ప్రతాపం, రాత్రి వేళల్లో పెరిగిన ఉక్కపోత నగరవాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీనికితోడు దోమల బెడద అధికం కావడంతో ప్రజలు ఇళ్లలో నిరంతరాయంగా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా గ్రేటర్ హైదరాబాద్ చరిత్రలోనే వర్షాకాలంలో మొదటిసారి గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 4 వేల మెగావాట్ల మార్కును దాటేసింది.














