Last Updated:
Hyderabad: హైదరాబాద్ మహానగర భవిష్యత్తు అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన ప్రతిష్ఠాత్మక ‘కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు – 2024’ (CURE)కు తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
మొదట ఈ బిల్లులో ఏటా ఆస్తిపన్నును 20 శాతం వరకు పెంచే వెసులుబాటును ప్రతిపాదించగా, పలువురు శాసనసభ్యుల అభ్యంతరాల మేరకు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆస్తిపన్ను పెంపును ఏటా గరిష్ఠంగా 10 శాతానికే పరిమితం చేస్తూ సవరణ చేయడానికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అంగీకరించారు. ఈ సవరణతో సభ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది.














