Last Updated:
BRICS 2026: బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు వేదికగా భారత్ అత్యంత కీలకమైన దౌత్య విజయాన్ని నమోదు చేసింది.
తీవ్ర విభేదాలు, భిన్న వైఖరులు ఉన్న సభ్య దేశాలను ఏకతాటిపైకి తెస్తూ ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ను ఏకగ్రీవంగా ఆమోదింపజేయడంలో భారత్ విజయవంతమైంది. ముఖ్యంగా పశ్చిమాసియా సంక్షోభంపై తీవ్ర వివాదాస్పద అంశాలపై ఏకాభిప్రాయం సాధించేందుకు భారత దౌత్య బృందం రాత్రంతా శ్రమించి, తెల్లవారుజామున సుమారు 4 గంటల వరకు చర్చలు జరిపింది. చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ దౌత్య సమతుల్యత చివరకు ఫలించింది.














