బాలీవుడ్ ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ శ్రేయా ఘోషల్ గురించి భారతీయ సంగీత ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హిందీతో పాటు తెలుగు, తమిళం, బెంగాలీ, మలయాళం తదితర పలు భాషల్లో వేలాది పాటలు పాడి, తన మధురమైన గాత్రంతో కోట్లాది మంది అభిమానులను ఆమె సంపాదించుకున్నారు. నాలుగు జాతీయ అవార్డులు, మరెన్నో ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు అందుకున్న శ్రేయా ఘోషల్.. తాను ఈ అద్భుతమైన స్థాయికి చేరుకోవడానికి కారణం తన కుటుంబం, ముఖ్యంగా తన తండ్రి బిశ్వజిత్ ఘోషల్ అందించిన అండదండలేనని పలు వేదికలపై గర్వంగా చెబుతుంటారు.













