Last Updated:
USA vs IRAN: ఇరాన్‌తో జరిగిన యుద్ధం కారణంగా అమెరికా ఎదుర్కొన్న సైనిక, ఆర్థిక నష్టాల తీవ్రతపై యూఎస్ ప్రభుత్వ పర్యవేక్షణ సంస్థ (US Government Watchdog) సమగ్ర అధికారిక నివేదికను విడుదల చేసింది.
ఈ యుద్ధం కారణంగా అమెరికా వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాల నిల్వలు గణనీయంగా పడిపోయాయని, కీలక ఆయుధాల పునరుద్ధరణలో తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని నివేదిక హెచ్చరించింది. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 మధ్య కాలాన్ని విశ్లేషిస్తూ పెంటగాన్ ఇన్స్పెక్టర్ జనరల్ రూపొందించిన ఈ సంయుక్త నివేదికలో.. రక్షణ, విదేశాంగ శాఖలతో పాటు అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (USAID) పర్యవేక్షకులు వెల్లడించిన కీలక అంశాలను పొందుపరిచారు. పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) వ్యాప్తంగా ఉన్న యూఎస్ సైనిక స్థావరాలు, యుద్ధ విమానాలు, దౌత్య కార్యాలయాలకు వాటిల్లిన భారీ నష్టాన్ని ఇది వివరించింది.














