ఆనందం సినిమా తర్వాత శ్రీనువైట్ల వెనక్కి తిరిగి చూసుకోలేదు. సొంతం, వెంకీ, అందరివాడు, ఢీ, దుబాయ్ శీను, రెడీ, కింగ్, ఓం నమో వెంకటేశా, దూకుడు, బాద్షా… ఇలా వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ టాలీవుడ్లో తిరుగులేని దర్శకుడిగా మారిపోయాడు. మరీ ముఖ్యంగా కమర్షియల్ సినిమాలకు తన స్టైల్ ఆఫ్ కామెడీని మిక్స్ చేసి హిట్లు కొట్టడంలో శ్రీనువైట్ల దిట్ట. అంతెందుకు.. పై సినిమాలన్నీ చాలా మంది ఎన్నో సార్లు రిపీటెడ్గా చూసినవే. ఇప్పటీకీ ఈ సినిమాలు టీవీల్లో వస్తున్నాయంటే ఛానల్ కూడా ఛేంజ్ చేయకుండా చూస్తుంటాం. అయితే దూకుడు తర్వాత శ్రీనువైట్ల డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది.














