Trump | ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్ | ACTPnews

Trump | ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్



ఇజ్రాయెల్ రాజకీయాల్లో ముందస్తు ఎన్నికల సెగలు రేగుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సారథ్యంలోని అధికార కూటమిలో తీవ్ర సంక్షోభం నెలకొనడం, ఆయన పదవికే ముప్పు వచ్చేలా ముందస్తు ఎన్నికల దిశగా అడుగులు పడుతుండటంతో ట్రంప్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో జోక్ చేస్తూ.. “ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రజల్లో నాకు 99 శాతం ప్రజాదరణ ఉంది. బహుశా అమెరికాలో నా పదవీకాలం ముగిసిన తర్వాత నేను ఇజ్రాయెల్ వెళ్లి అక్కడి ప్రధానమంత్రి పదవికి పోటీ చేస్తానేమో” అని వ్యాఖ్యానించారు. అలాగే, ఇరాన్ సంక్షోభంపై నెతన్యాహుకు ఏం చెప్పారని రిపోర్టర్లు ప్రశ్నించగా.. “ఆయన చాలా మంచి వ్యక్తి, నేను ఏం చెప్తే అదే వింటారు. ఆయన ఒక యుద్ధ కాలపు ప్రధాని, కానీ ఇజ్రాయెల్లో ఆయనకు దక్కాల్సిన సరైన గౌరవం దక్కడం లేదు” అని నెతన్యాహుకు ట్రంప్ మద్దతుగా నిలిచారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports