Last Updated:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘రాకా’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘రాకా’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్‌ను అట్లీ ఎలాంటి పాత్రలో చూపించబోతున్నాడనే ఆసక్తి ఒకవైపు.. ఈ సినిమాలో ఉండబోయే భారీ యాక్షన్, మాఫియా బ్యాక్‌డ్రాప్ మరోవైపు సినిమాపై హైప్‌ను మరింత పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘రాకా’కు సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక రీసెంట్‌గా మేకర్స్ ఇచ్చిన ఓ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రోజు సినిమాకు సంబంధించిన ఓ ప్రత్యేకమైన అప్‌డేట్‌ను వెల్లడించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో అసలు ఆ సర్ప్రైజ్ ఏంటి? సినిమాలోని ఏ అంశాన్ని బయటపెట్టబోతున్నారు? అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు ఉదయం నుంచే ఈ అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు అప్‌డేట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను, ప్రకటన సమయాన్ని చిత్రబృందం వెల్లడించకపోవడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. సాధారణంగా సినిమాకు సంబంధించిన కీలక విషయాలను ముందుగానే ప్రకటించే మేకర్స్.. ఈసారి మాత్రం సస్పెన్స్ మెయింటైన్ చేయడంతో అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఎలాంటి ఆలస్యం లేకుండా అప్‌డేట్‌ను విడుదల చేయాలని కోరుతూ పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్‌ను ట్యాగ్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు.
ఇక ‘రాకా’లో అల్లు అర్జున్ సరసన పలువురు స్టార్ హీరోయిన్లు నటిస్తున్న విషయం తెలిసిందే. దీపికా పదుకొణెతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. అలాగే జాన్వీ కపూర్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటికే భారీ స్టార్ కాస్ట్ సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది.
అల్లు అర్జున్ కోసం అట్లీ కూడా చాలా ప్రత్యేకంగా కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం.. మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ డాన్ చుట్టూ ప్రధాన కథ నడుస్తుందని ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ పాత్రను కూడా గత సినిమాలతో పోల్చితే పూర్తిగా భిన్నమైన షేడ్స్‌లో అట్లీ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. యాక్షన్‌తో పాటు ఎమోషన్, డ్రామా, మాస్ ఎలిమెంట్స్‌కు కూడా సినిమాలో ప్రాధాన్యం ఉండబోతున్నట్లు సమాచారం.
అంతేకాదు.. ‘రాకా’ కోసం అట్లీ కొన్ని ప్రత్యేకమైన గెస్ట్ రోల్స్‌ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ పాత్రల్లో ప్రముఖ నటులు కనిపించే అవకాశం ఉందనే ప్రచారం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. అయితే ఈ గెస్ట్ రోల్స్‌కు సంబంధించిన వివరాలను మేకర్స్ ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు.
ఇప్పటికే అల్లు అర్జున్‌కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌కు తోడు.. అట్లీకి ఉన్న మాస్ టేకింగ్, భారీ కమర్షియల్ సినిమాలను తెరకెక్కించే శైలి కలవడంతో ‘రాకా’పై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు చిత్రబృందం ఇవ్వబోయే తాజా అప్‌డేట్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. అది ఫస్ట్ లుక్‌నా, టైటిల్‌కు సంబంధించిన విషయమా, స్టార్ కాస్ట్‌లో మరో సర్‌ప్రైజ్‌నా లేదా షూటింగ్‌కు సంబంధించిన కీలక ప్రకటననా అనేది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే. మొత్తంగా విడుదలకు ముందే ‘రాకా’ దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్న సినిమాగా నిలుస్తుంది.














