అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ‘దాడులు చేస్తే సరికొత్త ఆయుధాలతో విరుచుకుపడతాం’! | | ACTPnews

News18


Last Updated:

అమెరికాపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమపై మళ్లీ దాడులకు దిగితే ప్రపంచం నివ్వెరపోయేలా సరికొత్త ఆయుధాలతో పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడతామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

News18
News18

అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరో కొత్త మలుపు తిరుగుతున్నాయి. తమ దేశంపై అమెరికా మళ్లీ సైనిక దాడులకు తెగబడితే ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. పశ్చిమాసియా ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా సరికొత్త ఆయుధాలతో భీకర దాడులు చేస్తామని ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధి హొస్సేన్ మొహెబ్బీ ఆదివారం నాడు స్పష్టం చేసినట్లు న్యూస్18 కథనం పేర్కొంది. ఒకవేళ అమెరికా దాడులు మొదలుపెడితే, ఇరాన్ రక్షణ, ఎదురుదాడి వ్యూహాల్లో భారీ మార్పులు ఉంటాయని ఆయన వెల్లడించారు.

యుద్ధం జరిగే ప్రాంతం, వాడే ఆయుధాలు, లక్ష్యాలు పూర్తిగా మారిపోతాయని తెలిపారు. యుద్ధభూమిలోకి ఎన్నడూ చూడని కొత్త తరహా ఆయుధాలను తీసుకొస్తామని, వాటి సామర్థ్యం చూసి ప్రపంచం నివ్వెరపోవడం ఖాయమని మొహెబ్బీ ధీమా వ్యక్తం చేశారు. గతంలో టార్గెట్ చేసిన ప్రాంతాలను కాకుండా, ఇప్పటివరకు దాడి చేయని అమెరికా కొత్త స్థావరాలను టార్గెట్ చేస్తామని ఆయన హెచ్చరించారు.

అమెరికా దాడులకు కుట్ర

ఇరాన్‌పై సైనిక చర్యను పునఃప్రారంభించడానికి అమెరికా చురుకుగా సన్నాహాలు చేస్తోందని ఇరాన్ సాయుధ బలగాల కేంద్ర కార్యాలయం ‘ఖతం అల్-అన్బియా’ ఆరోపించింది. తమకు అందిన పక్కా నిఘా సమాచారం మేరకే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు తెలిపింది. ఒకవేళ అమెరికా సాహసం చేస్తే, తమ ప్రతిదాడి మునుపటి కంటే అత్యంత తీవ్రంగా ఉంటుందని తేల్చిచెప్పింది.

అమెరికాలో ఆయుధాల కొరత

మరోవైపు అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ నివేదిక సంచలన విషయాలు వెల్లడించింది. ఇరాన్‌తో నెలకొన్న ఘర్షణల కారణంగా అమెరికా ఆయుధ నిల్వలు భారీగా తగ్గిపోయాయని పెంటగాన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ పేర్కొన్నారు. ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య కాలంలో ఏకంగా 22 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను వాడటంతో భారీ కొరత ఏర్పడిందని నివేదిక స్పష్టం చేసింది.

అయితే, ఆయుధాల కొరత ఉందన్న వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. తమ వద్ద అపరిమితమైన ఆయుధ నిల్వలు ఉన్నాయని, కొరత ఉందంటూ వస్తున్న వార్తలన్నీ పూర్తిగా ఫేక్ న్యూస్ అని ఆయన కొట్టిపారేశారు. అటు ఇరాన్ హెచ్చరికలు, ఇటు అమెరికా ఆయుధ కొరత నివేదికలతో పశ్చిమాసియాలో భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed