Tirumala: సూర్యప్రభ వాహనంపై శ్రీవారిని ఎందుకు దర్శించుకోవాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

News18


Last Updated:

సూర్యప్రభ వాహనంపై శ్రీవారి దర్శనం.. ఈ ఒక్క దర్శనంతో భక్తులకు కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే!

+

News18

భక్తిభావం వెల్లివిరుస్తున్న తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ భక్తులకు కనుల పండువను పంచుతున్నాయి. ఏడో రోజైన సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామివారు భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. ఉదయం సరిగ్గా ఎనిమిది గంటలకు లేలేత సూర్యకాంతుల నడుమ స్వామివారు మాడ వీధుల్లోకి రాగానే భక్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కన్నుల పండువగా సాగిన ఈ వాహనసేవలో అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ భక్తులు పులకించిపోయారు.

తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న శ్రీవారిని చూసి వేలాది మంది భక్తులు భక్తిపారవశ్యంతో చేతులెత్తి మొక్కుకున్నారు. “గోవిందా.. గోవిందా” అంటూ చేసిన నామస్మరణతో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి క్షేత్రం ప్రతిధ్వనించింది. స్వామివారి వాహనం ముందు భక్తబృందాలు చేసిన చెక్కభజనలు, కోలాటాలు ఉత్సవానికి మరింత శోభను తెచ్చాయి. మంగళవాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా సాగిన ఈ వేడుకలో స్వామివారిని కీర్తిస్తూ కళాకారులు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ దివ్యమైన ఘట్టాన్ని కనులారా వీక్షించిన ప్రతి భక్తుడూ జన్మ ధన్యమైందన్న ఆనందంతో పరవశించారు.

ఇది కూడా చదవండి: Business Idea: కుందేలు బొచ్చుతో నెలకు రూ. 2 లక్షల సంపాదన.. అదిరే బిజినెస్ ఐడియా!

సూర్యప్రభ వాహనసేవకు ఆధ్యాత్మికంగా అపారమైన విశిష్టత ఉంది. సూర్యుడిని సకల జీవులకు ఆరోగ్యాన్ని, చైతన్యాన్ని ప్రసాదించే దివ్యశక్తికి ప్రతీకగా భక్తులు విశ్వసిస్తారు. ప్రకృతికి చైతన్యప్రదాతగా, సకల రోగ నివారకుడిగా సూర్యభగవానుడిని సూర్యనారాయణుడిగా ఆరాధించడం అనాదిగా వస్తున్న ఆచారం. సూర్యమండల మధ్యవర్తిగా సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడు కొలువై ఉన్నాడనే భావనకు ఈ వాహనసేవ సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ పవిత్రమైన రోజున సూర్యప్రభ వాహనంపై ఉన్న మలయప్పస్వామివారిని దర్శించుకుంటే ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, భోగభాగ్యాలు, సత్సంతాన సంపద సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.

ఇది కూడా చదవండి: Heavy Rains: ఈ జిల్లాల్లో 3 రోజులు భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో వాయుగుండం!

ఉదయం సూర్యప్రభ వాహనంపై తేజస్సుతో దర్శనమిచ్చిన స్వామివారు, సోమవారం రాత్రి ఏడు గంటలకు చంద్రప్రభ వాహనంపై చల్లని కిరణాల నడుమ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. చంద్రప్రభ వాహనంపై స్వామివారిని కనులారా చూసేందుకు భక్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం ఏడు గంటలకు రథోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ రథోత్సవంలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఇప్పటికే తిరుమలకు చేరుకుంటున్నారు.

ఈ వైభవపేతమైన సూర్యప్రభ వాహనసేవలో పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు భాగస్వాములయ్యారు.  పెద్దజీయర్‌స్వామి,  చిన్నజీయర్‌స్వామి ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. వారితో పాటు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో కె.వి. మురళీకృష్ణ స్వామివారి సేవలో తరించారు. వీరేకాకుండా పలువురు బోర్డు సభ్యులు, ఇతర అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. వాహనసేవల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్త్రృతమైన ఏర్పాట్లు చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed