US Mid Term elections 2026: అమెరికా ఎన్నికల్లో హనుమంతుడు.. 90 అడుగుల విగ్రహం చుట్టూ వివాదం! | | ACTPnews

PC: X.com


Last Updated:

US Mid Term elections 2026: అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో కొలువుదీరిన 90 అడుగుల భారీ హనుమంతుడి విగ్రహం చుట్టూ రాజకీయ దుమారం చెలరేగింది.

PC: X.com
PC: X.com

ఒక కన్జర్వేటివ్ యూట్యూబర్ ఈ విగ్రహాన్ని కూల్చివేయాలని పిలుపునివ్వడంతో, హిందూ సంఘాలు, ప్రముఖ మేధావుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టెక్సాస్‌లోని షుగర్‌ల్యాండ్‌లో ఉన్న అష్టలక్ష్మి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించిన స్టాచ్యూ ఆఫ్ యూనియన్ (హనుమంతుడి విగ్రహం) ఆగస్టు 2024లో ప్రాణప్రతిష్ఠ జరుపుకుంది. అయితే అప్పటి నుంచి కొంతమంది క్రిస్టియన్ కన్జర్వేటివ్‌లు దీనిని క్రైస్తవ వ్యతిరేకంగా చిత్రీకరిస్తూ వివాదం సృష్టిస్తున్నారు.  న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. ఇటీవల యూట్యూబర్ జెస్సీ హ్యూస్ ఈ విగ్రహం ఫోటోను షేర్ చేస్తూ.. “మేము గెలిచిన తర్వాత దీనిని కూల్చివేస్తాం” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తీవ్రంగా స్పందించిన మాజీ సైనికుడు, హిందూ సంఘాలు

హ్యూస్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా సైన్యంలో పనిచేసిన మాజీ సైనికుడు రుచిర్ బక్షి తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు దేశభక్తికి విరుద్ధమని, “హిందూ మతంపై జరుగుతున్న దాడి” అని ఆయన అభివర్ణించారు. “ఒక మతాన్ని ద్వేషిస్తూ మరో అమెరికన్ సమాజానికి చెందిన ప్రార్థనా మందిరాన్ని ధ్వంసం చేయాలనుకోవడం హిందూ మతానికే ముప్పు. అమెరికాలో గెలవడం అంటే హిందూ దేవాలయాలను కూల్చడమే అయితే, నేను పోరాడి కాపాడిన దేశం ఇది కాదు. మీకంటే భిన్నంగా ఉన్న ప్రజలపై దాడి చేయడానికి మీరు కేవలం లైసెన్స్ కోరుకుంటున్నారు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రుచిర్ బక్షికి ‘కోయలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా’ (CoHNA)తో పాటు టెక్సాస్‌కు చెందిన మాజీ సైనికుడు, రాజకీయ విశ్లేషకుడు కార్ల్ వీలెస్ కూడా మద్దతు ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా మతవిద్వేషాన్ని వ్యాప్తి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని CoHNA తెలిపింది.

ఎన్నికల వేళ పెరుగుతున్న విద్వేష ప్రచారం

ఐదు లక్షలకు పైగా భారతీయ అమెరికన్లు నివసిస్తున్న టెక్సాస్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా వలసదారుల వ్యతిరేక అంశాలు తెరపైకి రావడం గమనార్హం. ఇటీవల టెక్సాస్ రైల్‌రోడ్ కమిషనర్ రేసులో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి బో ఫ్రెంచ్ కూడా దక్షిణాసియా మూలాలున్న విద్యార్థులపై జాత్యహంకార వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఫుట్‌బాల్ మ్యాచ్ విజయోత్సవంలో పాల్గొన్న విద్యార్థుల ఫోటోను షేర్ చేస్తూ ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయగా, డెమొక్రాట్లతో పాటు పలువురు రిపబ్లికన్ నేతలు సైతం ఆయన తీరును తప్పుబట్టారు. టెక్సాస్‌లో ఎన్నికల వేడి కొనసాగుతున్న తరుణంలో, పవిత్రమైన ఆలయ విగ్రహంపై ఇలాంటి వ్యాఖ్యలు రావడం స్థానిక భారతీయ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports