Last Updated:
Chiranjeevi: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో గత నాలుగు దశాబ్ధాలకుపైగా తన నటన, డ్యాన్స్‌తో విపరీతమైన ఫ్యాన్ బేస్, క్రేజ్ సొంతం చేసుకున్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. సుమారు 155కి పైగా సినిమాల్లో యాక్ట్ చేసిన శివశంకర వరప్రసాద్ ఉరఫ్ చిరంజీవిగా పేరు మారి నేటికి 48 సంవత్సరాలు.
Chiranjeevi: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో గత నాలుగు దశాబ్ధాలకుపైగా తన నటన, డ్యాన్స్‌తో విపరీతమైన ఫ్యాన్ బేస్, క్రేజ్ సొంతం చేసుకున్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. సుమారు 155కి పైగా సినిమాల్లో యాక్ట్ చేసిన శివశంకర వరప్రసాద్ ఉరఫ్ చిరంజీవిగా పేరు మారి నేటికి 48 సంవత్సరాలు. తల్లిదండ్రులు పెట్టిన పేరుతో నటుడిగా సిల్వర్ స్క్రీన్‌కి పరిచయమైతే.. తన సొంత ఇమేజ్‌తో చిరంజీవిగా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. సార్ధకనామధేయుడిగా ఇప్పటికి యువ హీరోలు, కొడుకు, తమ్ముడు, మేనల్లుళ్లతో పోటీ పడి వరుసగా హిట్స్ ఇస్తున్న సుప్రీం హీరో తన 48 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రోజును గుర్తు చేసుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ ద్వారా ప్రేక్షకుల హార్ట్‌ని టచ్ చేశారు బాస్.సరిగ్గా 22 సెప్టెంబర్ 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో చిరంజీవి నటప్రస్థానం మొదలైంది. ఆరోజు మొదలైన నా సినీ ప్రయాణం నేటితో 48 వసంతాలు పూర్తి చేసుకుంది.
చిరంజీవి అంటే ఇండియన్ సినిమాలో ఓ మైఖేల్ జాక్సన్‌తో సమానం. తెలుగు చిత్ర పరిశ్రమకు అదిరిపోయే స్టెప్పులు,షేక్ డ్యాన్స్, బ్రేక్ డ్యాన్స్‌తో పాటు స్టైలీష్ యాక్టింగ్‌ని పరిచయం చేసిన ఓ విలక్షణ నటుడు. అందుకే ఇండస్ట్రీలోకి ప్రాణం ఖరీదు సినిమాతో 22 సెప్టెంబర్ 1978లో అడుగుపెట్టిన ఆయన్ని చిరంజీవిగా 48 సంవత్సరాలుగా అభిమానులు గుండెల్లో పెట్టుకొని ఆరాదిస్తున్నారు. ఆయన నటన చూసి మురిసిపోతున్నారు. శివశంకర వరప్రసాద్‌గా ఉన్న తన పేరును చిరంజీవిగా మార్చిన ఈ 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు పోషించానని. ఎన్నో విజయాలను చూశానని… ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్నట్లుగా స్వయంగా చిరంజీవి ఎక్స్(ట్విట్టర్)లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
22 సెప్టెంబర్ 1978
ఆరోజు మొదలైన నా సినీ ప్రయాణం నేటితో 48 వసంతాలు పూర్తి చేసుకుంది.
ఈ 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు పోషించాను. ఎన్నో విజయాలను చూశాను. ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్నాను.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, నాలోని నటుడిని కొత్త కొత్త… pic.twitter.com/5wBJnXl3MP
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2026
ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతలతో పాటు నాలోని నటుడిని కొత్త కొత్త కోణాల్లో ఆవిష్కరించిన ప్రతి దర్శకుడికి ప్రతి సినిమా వెనుక అహర్నిశలు శ్రమించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్. ఇండస్ట్రీలో అందరి సహకారమే తనను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని తన నిరాడంబర స్వభావాన్ని మరోసారి నిరూపించుకున్నారు.
ప్రతీ సినిమా వేదికలపై తనకు అభిమానుల తర్వాత ఏదైనా అంటూ చెప్పుకునే చిరంజీవి ఈసందర్భంగా కూడా ఫ్యాన్స్ లేకపోతే తాను లేను అన్నట్లుగా చెప్పుకొచ్చారు. తన 48 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఇప్పటి వరకు ఆ విజయాలన్నింటికంటే గొప్పది… మీరు నాపై చూపించిన ప్రేమ. ఆ గౌరవాలన్నింటికంటే విలువైనది… మీ హృదయాల్లో నాకు ఇచ్చిన స్థానం అంటూ అద్భుతమైన అభిమానాన్ని పంచుకున్నారు.తనను మీ కుటుంబ సభ్యుడిగా భావించి, ఇంతటి అపూర్వమైన ప్రేమాభిమానాలను అందించిన ప్రతి ఒక్క అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ముగించారు.
నిజంగా తాను ప్రాణం ఖరీదు సినిమా రిలీజైన ఆరోజు “చిరంజీవి” అనేది నేను పెట్టుకున్న పేరు. కాని నేడు మీ ప్రేమతో అది నాకు దక్కిన శాశ్వతమైన గుర్తింపుగా భావిస్తున్నానని తెలిపారు. మీ ప్రేమకు, అభిమానానికి ఎప్పటికీ కృతజ్ఞతలతో మీ చిరంజీవి అంటూ అభిమానులకు తనకున్న కృతజ్ఞత భావాన్ని సోషల్ మీడియా వేదికగా వెలిబుచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఇక చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ చూసిన ప్రతీ ఒక్కరు మీరు ఇండస్ట్రీ బాస్ మాత్రమే కాదు బిగ్ బాస్ అంటున్నారు. మీ స్థానం మా గుండెల్లో ఇప్పుడే కాదు ఎప్పటికి పదిలంగానే ఉంటుందని మరికొందరు కామెంట్స్ షేర్ చేస్తున్నారు.










