Jani Master: జానీ మాస్టర్ భార్య సుమలతకు బిగ్ షాక్.. కార్యవర్గాన్ని రద్దు చేసిన ఫిల్మ్ ఫెడరేషన్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి సుమలతకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలుగు సినీ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఫిల్మ్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.

News18
News18

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి సుమలతకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలుగు సినీ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఫిల్మ్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో సుమలత నేతృత్వంలోని ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అసోసియేషన్ అధ్యక్షురాలిగా సుమలత పదవీకాలం ముగిసినట్లయింది.

డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో నెలకొన్న పరిణామాలపై చర్చించేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీకి సుమలత, రఘు మాస్టర్ వర్గాలతో పాటు అసోసియేషన్‌కు చెందిన పెద్ద సంఖ్యలో డ్యాన్సర్లు హాజరయ్యారు. మొత్తం 225 మందికి పైగా డ్యాన్సర్లు సమావేశానికి హాజరైనట్లు సమాచారం. యూనియన్‌లో నెలకొన్న వివాదాలు, సభ్యుల అభిప్రాయాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ సమావేశంలో డ్యాన్సర్ల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. అసోసియేషన్‌లోని ప్రస్తుత పరిస్థితులపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు సమాచారం. ఈ క్రమంలో సుమలతకు మద్దతుగా 11 మంది మాత్రమే నిలిచినట్లు, మరోవైపు రఘు మాస్టర్‌కు 214 మందికి పైగా డ్యాన్సర్లు మద్దతు తెలిపినట్లు సమావేశంలో వెల్లడైంది. దీంతో అసోసియేషన్‌లో మెజారిటీ సభ్యుల మద్దతు రఘు మాస్టర్ వైపు ఉన్నట్లు స్పష్టమైనట్లు తెలుస్తోంది.

సభ్యుల నుంచి వచ్చిన అభిప్రాయాల నేపథ్యంలో ఫిల్మ్ ఫెడరేషన్ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సుమలత అధ్యక్షతన కొనసాగుతున్న ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు తీర్మానించారు. దీంతో ఇంతకాలం అసోసియేషన్‌ను నడిపించిన సుమలత నాయకత్వానికి ముగింపు పలికినట్లయింది. అయితే కార్యవర్గం రద్దుకు దారితీసిన అంశాలపై ఫెడరేషన్ నుంచి మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉంది.

మరోవైపు అసోసియేషన్‌లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు సభ్యుల నుంచి వచ్చినట్లు సమాచారం. ఇదే కారణంగా యూనియన్‌లో విభేదాలు పెరిగాయని కొందరు సభ్యులు సమావేశంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో పలువురు ప్రముఖ కొరియోగ్రాఫర్లు రఘు మాస్టర్ నాయకత్వానికి మద్దతు తెలిపినట్లు సమాచారం.

ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేయడంతో అసోసియేషన్‌కు కొత్త నాయకత్వాన్ని ఎన్నుకునే ప్రక్రియను కూడా ఫిల్మ్ ఫెడరేషన్ ప్రారంభించింది. ఇందులో భాగంగా నూతన కార్యవర్గం కోసం ఎన్నికల తేదీని ప్రకటించారు. వచ్చే నెల అక్టోబర్ 11న తెలుగు సినీ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ స్పష్టం చేసింది.

అక్టోబర్ 11న జరగనున్న ఎన్నికల్లో కొత్త కార్యవర్గం ఎంపిక కానుంది. దీంతో డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో ప్రస్తుతం నెలకొన్న వివాదాలకు ఎలాంటి పరిష్కారం లభిస్తుంది? కొత్త నాయకత్వం ఎవరికి దక్కుతుంది? అనే అంశాలపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 225 మందికి పైగా డ్యాన్సర్లు పాల్గొన్న ఈ సమావేశం అనంతరం ఫిల్మ్ ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed