Ganesh Laddu New Record: వేలంలో రూ. ఒక కోటి లక్షకు పలికిన గణేష్ లడ్డూ.. బాలాపూర్ లడ్డూ వేలానికి ముందే రికార్డ్ బ్రేక్ | ట్రెండింగ్ | ACTPnews

Ganesh Laddu New Record: వేలంలో రూ. ఒక కోటి లక్షకు పలికిన గణేష్ లడ్డూ.. బాలాపూర్ లడ్డూ వేలానికి ముందే రికార్డ్ బ్రేక్ | ట్రెండింగ్


గణేష్ లడ్డూకి కోట్లలో డిమాండ్

గణేష్ ఉత్సవాల్లో తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ గా చెప్పుకునే వాటిలో మొదటిది ఖైరతాబాద్‌లో బడా గణేష్ విగ్రహం. రెండోవది బాలాపూర్‌లో వేలం వేసే లడ్డూ ప్రసాదం. అయితే ఏటా పాతిక లక్షలకుపైగా పలికే బాలాపూర్ లడ్డూ ధరను రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కీర్తి రిచ్‌మండ్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో నిర్వహించిన లడ్డూ వేలంలో గణపతి లడ్డూ ప్రసాదం ఏకంగా రూ.1.01 కోట్లు పలికింది. ప్రతి ఏటా పోటాపోటీగా జరిగే ఈ వేలంలో ఈసారి శక్తిమాన్‌ బృంద సభ్యులు లడ్డూను కైవసం చేసుకున్నారు.

(గణేష్ లడ్డూ వేలం)

(రూ. కోటి లక్ష రూపాయలు పలికిన గణేష్ లడ్డూ ధర)
కోటి లక్ష పలికిన లడ్డూ..

కీర్తి రిచ్‌మండ్‌ విల్లాస్‌లో లడ్డూ వేలానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కమ్యూనిటీ వాసులు నాలుగు గ్రూపులుగా విడిపోయి ప్రతి ఏటా పోటీ పడుతుంటారు. ఈసారి కూడా మంగళవారం అర్ధరాత్రి వరకు ఉత్కంఠభరితంగా సాగిన వేలంలో శక్తిమాన్ బృందం గణపతి ప్రసాదాన్ని సొంతం చేసుకుంది. గతేడాది (2025) ఇదే కమ్యూనిటీలో లడ్డూ రికార్డు స్థాయిలో రూ.2.31 కోట్లు పలకడం ఇంకా విశేషం. అంటే గతేడాదితో పోలిస్తే కోటి 30 లక్షలు తక్కువకే ఈసారి దక్కించుకున్నారు శక్తిమాన్‌ బృంద సభ్యులు.

గతేడాదితో పోలిస్తే కోటి తక్కువ..

గతేడాదితో పోలిస్తే ఈసారి వేలంలో లడ్డూ ప్రసాదం తక్కువ ధరకే పోయింది. కాని కోటి రూపాయలు దాటడంతో ఇప్పటి వరకు హైదరాబాద్ పరిసరాల్లో లడ్డూ ప్రసాదాల వేలంలో ఇదే అత్యంత ఖరీదైన లడ్డూగా రికార్డ్ నెలకోల్పింది. స్వామివారి లడ్డూను దక్కించుకోవడం వల్ల శుభం, ఐశ్వర్యం కలుగుతాయనే బలమైన విశ్వాసంతో భక్తులు ఎంతటి ధరకైనా వెనుకాడటం లేదు. కీర్తి రిచ్‌మండ్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో కూడా అదే సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నారు.

30ఏళ్లుగా వేలం..

హైదరాబాద్‌లోని గేటెడ్ కమ్యూనిటీలలో లడ్డూ వేలం పాటలు కోట్లలో జరుగుతుండగా, ఇప్పుడు అందరి దృష్టి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే బాలాపూర్ లడ్డూ వేలంపై కేంద్రీకృతమైంది. రేపు చారిత్రక బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం జరగనుంది. బాలావూర్ లడ్డూ వేలం 1994లో రూ.450తో మొదలైంది. గడిచిన 30 ఏళ్లలో ఈ వేలం ధరలో లడ్డూ లక్షలు దాటిపోయి కోటి చేరుకుంటోంది. గతేడాది బాలాపూర్ లడ్డూను కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్‌ గౌడ్‌ రూ.35 లక్షలకు దక్కించుకోగా 2024లో రూ.30.01 లక్షలు పలికింది. అయితే ఈసారి ఈసారి పూరీ జగన్నాథ ఆలయ నమూనాలో ఏర్పాటు చేసిన మండపంలో కొలువైన బాలాపూర్ గణపయ్య లడ్డూ (21 కిలోలు) కొత్త రికార్డు సృష్టిస్తుందా? అనే ఆసక్తి ఇప్పటి నుంచే మొదలైంది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈసారి జరిగిన లడ్డూ వేలం ధరలు ఇవే

హైటెక్ సిటీ(కోహినూర్ ఆరో రియాల్టీ)— రూ. 30,50,001

మైహోమ్ మంగళ- రూ.21,11,116

నెల్లూరు లంభోదర — రూ.13,50,000

ఇండీస్ వైవా సిటీ — రూ.13,00,00

ప్రగతి నగర్ — రూ.13,00,000

కూకట్ పల్లి- రూ.10,00,000

ఫ్లంట్ లైన్ సెవెన్ — రూ.8,00,000

మైహోమ్ అవతార్— రూ. 8,00,000

అపర్ణ సరోవర్- రూ.5,00,000

మై హోమ్ విహగ్న— రూ. 4,20,000

మల్కాజ్ గిరి(కాకతీయనగర్)— రూ. 3,70,000

మీనాక్షి స్కైలాంగ్ — రూ. 3,20,000

అపర్ణ టవర్స్— రూ.2,00,000

శ్రీసాయిరామ్ టవర్స్ (హఫీజ్ పేట్)- రూ. 1,60,000

బాలాపూర్ లడ్డూ ధర రికార్డ్ బద్దలయ్యేనా..

గేటెడ్ కమ్యూనిటీలలో కోట్లలో ధర పలుకుతున్న నేపథ్యంలో బాలాపూర్ లడ్డూ ఆ రికార్డులను అందుకుంటుందా? లేదా? అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. బాలాపూర్ వేలం అనంతరం జరిగే గణేశుడి శోభాయాత్రతోనే నగర నిమజ్జనం ప్రారంభం అవుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed