Last Updated:
రణ్ బీర్ కపూర్, విక్కీ కౌశల్ హీరోలుగా, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ & వార్’ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని సినీ ప్రియులు తెగ వేయిట్ చేస్తున్నారు.
రణ్ బీర్ కపూర్, విక్కీ కౌశల్ హీరోలుగా, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ & వార్’ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని సినీ ప్రియులు తెగ వేయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోతుంది. రీసెంట్‌గా ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన రణ్‌బీర్ లుక్‌కు ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఓ వైపు రక్తంతో తడిసిన చేయి.. మరోవైపు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని కూల్‌గా కారు డ్రైవ్ చేస్తున్న లుక్ మాములు సెన్సేషన్ అవలేదు.
తాజాగా ఈ సినిమా నుంచి అలియా భట్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ లుక్ మాత్రం మాములుగా లేదు. ఫస్ట్ లుక్‌లో అలియా స్టైలిష్ స్లిట్ స్కర్ట్ ధరించి, ప్రత్యేకమైన హెడ్‌పీస్‌తో కుర్చీలో కూర్చుని కనిపించింది. ఆమె డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్, హెడ్‌పీస్‌తో పాటు ముఖంలో కనిపిస్తున్న ఎక్స్‌ప్రెషన్స్ పోస్టర్‌కు స్పెషల్ రెట్రో లుక్‌ను తీసుకొచ్చాయి. ఇలా ఫస్ట్ లుక్ రిలీజైందో లేదో.. అలా వైరల్ అవుతుంది.

అలియా భట్ ఫస్ట్ లుక్‌ను చూస్తే ఆమె గతంలో కనిపించిన పాత్రలకు పూర్తిగా భిన్నమైన అవతార్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అలియా చూపుల్లో కనిపిస్తున్న ఇంటెన్సిటీ ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తిని మరింత పెంచుతుంది.
సంజయ్ లీలా భన్సాలీ సినిమాల్లో పాత్రల లుక్, కాస్ట్యూమ్స్, సెట్స్, విజువల్స్‌కు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. అయితే ‘లవ్ & వార్’ విషయంలో మాత్రం ఆయన తన గత సినిమాలకు భిన్నమైన ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు రిలీజైన ఫస్ట్ లుక్స్ చూస్తే ఈ సినిమా పూర్తిగా మరో కొత్త నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అలియా భట్ లుక్‌లో కనిపిస్తున్న ఆధునిక స్టైలింగ్‌తో పాటు రెట్రో టచ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఈ సినిమాలో రియల్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ మరోసారి రీల్ జంటగా కనిపించనున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ బాక్సాఫీస్ దగ్గర అరివీర భయంకర హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు మరోసారి అదే కాంబో స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. మరోవైపు విక్కీ కౌశల్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ ముగ్గురు టాలెంటెడ్ నటులను ఒకే సినిమాలో సంజయ్ లీలా భన్సాలీ ఎలా చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
‘లవ్ & వార్’ టైటిల్‌కు తగ్గట్టుగానే ప్రేమ, సంఘర్షణ, భావోద్వేగాలు, యాక్షన్ అంశాల కలయికగా సినిమా ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. నిజానికి ట్రైయాంగిల్ లవ్ స్టోరీలను పీరియాడిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించడంలో భన్సాలీ దిట్ట. అయితే ఈ సారి వింటేజ్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 21న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది.














