Khairatabad Bada Ganesh Visarjan Completed! | గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణపయ్య! | ACTPnews

Khairatabad Bada Ganesh Visarjan Completed!



హైదరాబాద్లోని ప్రముఖ ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జన ప్రక్రియ ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నంబర్ 4 వద్ద ప్రశాంతంగా ముగిసి గంగమ్మ ఒడికి చేరాడు. ఈ ఏడాది 69 అడుగుల ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా దర్శనమిచ్చిన స్వామివారి శోభాయాత్ర ఉదయం 9.30 గంటలకు ఖైరతాబాద్ నుంచి ప్రారంభమైంది. సెన్సేషన్ థియేటర్, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా ఎన్టీఆర్ మార్గ్కు చేరింది. మధ్యాహ్నం 2.15 గంటలకు భారీ క్రేన్ల సాయంతో ఉత్సవ కమిటీ ప్రత్యేక పూజల అనంతరం నిమజ్జనాన్ని పూర్తి చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports