Balapur Ganesh Laddu Auction 2026: బాలాపూర్ లడ్డూ వేలం ఈసారి రూ. కోటి దాటేనా..! 32 ఏళ్ల క్రితం ఫస్ట్ వేలం ధర ఎంతో తెలుసా..? | తెలంగాణ వార్తలు | ACTPnews

Balapur Ganesh Laddu Auction 2026: బాలాపూర్ లడ్డూ వేలం ఈసారి రూ. కోటి దాటేనా..! 32 ఏళ్ల క్రితం ఫస్ట్ వేలం ధర ఎంతో తెలుసా..? | తెలంగాణ వార్తలు


మూడు దశాబ్ధాల చరిత్ర కలిగిన లడ్డూ వేలం..

బాలాపూర్ లడ్డూ వేలానికి దేశ వ్యాప్తంగా ఓ హిస్టరీ ఉంది. 32 సంవత్సరాల క్రితం మొదలైన ఈ లడ్డూ ప్రసాదం వేలం ఇప్పటికి రికార్డు స్థాయిలో ధర పలుకుతూ వస్తోంది. తొలివేలంలో 1994లో రూ.450 వేలంలో కొలను మోహన్‌రెడ్డి లడ్డూ దక్కించుకున్నారు. ఏటా లడ్డూ ధర ఊహించని విధంగా పెరుగుతూ రాగా.. 2025లో దశరథ్‌గౌడ్‌ రూ.35లక్షలకు దక్కించుకున్నారు. క్షణాల్లో పూర్తయ్యే లడ్డూ వేలం కోసం ఈసారి ప్రముఖులు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది రికార్డు ధరను ఈ ఏడాది వేలం బద్దలు కొడుతుందా అనే సందేహాలు ఇప్పుడు అందరిలో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక గడిచిన 32 ఏళ్లలో బాలాపూర్ లడ్డూ వేలం ధర ఎలా పెరుగుతూ వచ్చింది.. ఎవరు దక్కించుకున్నారు అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడుంది.

బాలాపూర్ లడ్డూ వేలం హిస్టరీ..

32 ఏళ్లుగా బాలాపూర్ లడ్డూ వేలం

ఈసంవత్సరం 33సారి వేలం

1994లో రూ.450(కొలను మోహన్‌రెడ్డి

2001 వరకు ప్రతీ ఏడాది వేలల్లో పలికిన లడ్డూ ధర

2002లో రూ.లక్షా 5వేలు(కందాడ మాధవరెడ్డి)

2007లో 4లక్షల 15వేలు(రఘునందన చారి )

2015లో రూ.10లక్షల 32వేలు(కల్లెం మదన్ మోహన్ రెడ్డి)

2016లో రూ.14లక్షల 65వేలు(స్కైలాబ్ రెడ్డి )

2017లో రూ.15లక్షల 60వేలు(నాగం తిరుపతి రెడ్డి )

2018లో రూ.16లక్షల 60వేలు(తేరేటి శ్రీనివాస్ గుప్తా)

2019లో రూ.17లక్షల 60వేలు(కొలను రాంరెడ్డి )

2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం పాటను రద్దు

అప్పటి సీఎం కేసీఆర్‌కు లడ్డూ ప్రసాదం అందజేత

2021లో రూ.18లక్షల 90వేలు(ఏపీ MLC రమేశ్ యాదవ్, నాదర్‌గుల్ చెందిన మర్రి శశాంక్ రెడ్డి)

2022లో రూ.24లక్షల 60వేలు(వంకేటి లక్ష్మా రెడ్డి)

2023లో రూ.27 లక్షలు (దయానందరెడ్డి)

2024లో రూ.30 లక్షల ఒక వెయ్యి(కొలను శంకర్ రెడ్డి)

2025లో రూ.35 లక్షలు(లింగాల దశరథ్ గౌడ్ )

ఈసారి మరో రెండు నుంచి 10 లక్షల వరకు పెరిగే ఛాన్స్.. కోటి రూపాయలు కూడా అవుతుందని అంచనా

అత్యంత పవిత్రంగా..

బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి అధ్వర్యంలో ఈ వేలం జరగనుంది. ఉదయం 9గంటలకు దీన్ని ప్రారంభిస్తారు. దీన్ని శుద్ధమైన నెయ్యి, గోంగూర పప్పు, బెల్లం, ఎండుమిర్చి, డ్రై ఫ్రూట్స్‌తో ఈ లడ్డూని తయారుచేస్తున్నారు. ఈ లడ్డూ, ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు తెస్తుందని నమ్ముతారు. వేలం నుంచి వచ్చిన ఆదాయాన్ని గ్రామ అభివృద్ధి, విద్యా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed