150కి పైగా జాబ్ ఆఫర్లు రద్దు! ఐఐటీ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నుంచి 22 కంపెనీలపై రెండేళ్ల నిషేధం | | ACTPnews

News18


Last Updated:

క్యాంపస్ సెలక్షన్స్‌లో ఎంపికైన విద్యార్థులకు ఇచ్చిన జాబ్ ఆఫర్లను చివరి నిమిషంలో రద్దు చేసిన 22 కంపెనీలపై ఆల్ ఐఐటీ ప్లేస్‌మెంట్ కమిటీ కఠిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఒరాకిల్ సహా ఆయా సంస్థలను రెండేళ్ల పాటు నిషేధించినట్లు నెట్టింట వైరల్ అవుతోంది.

News18
News18

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలలో (IITs) క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు సంబంధించి ఓ సంచలన వార్త సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2026లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇచ్చిన 150కి పైగా ఉద్యోగ ఆఫర్లను వివిధ కంపెనీలు చివరి నిమిషంలో వెనక్కి తీసుకున్నాయి. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ‘ఆల్ ఐఐటీ ప్లేస్‌మెంట్ కమిటీ’ (AIPC) ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle) సహా మొత్తం 22 కంపెనీలపై రాబోయే రెండు సీజన్ల పాటు క్యాంపస్ నియామకాల్లో పాల్గొనకుండా నిషేధం విధించినట్లు సమాచారం.

దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలలో ఈ నిషేధం అమలు కానుందని ‘ఇండియన్ టెక్ గైడ్’ అనే ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. పలు కంపెనీలు ఒక్కొక్కటి 10 నుంచి 15 ఆఫర్లను రద్దు చేయగా, ఒక్క ఒరాకిల్ సంస్థే వివిధ ఐఐటీలలో దాదాపు 40 ఉద్యోగ ఆఫర్లను వెనక్కి తీసుకున్నట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు.

బాధిత విద్యార్థులకు ప్రత్యామ్నాయ అవకాశాలు

ప్రస్తుతం జాబ్ మార్కెట్ క్లిష్టంగా ఉన్న తరుణంలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ మీదనే ఆశలు పెట్టుకున్న విద్యార్థులకు కంపెనీల తీరు శరాఘాతంగా మారింది. ఈ నేపథ్యంలో 23 ఐఐటీల ప్లేస్‌మెంట్ వ్యవహారాలను సమన్వయం చేసే కమిటీ బాధిత విద్యార్థులకు అండగా నిలిచింది. ఆఫర్లు కోల్పోయిన విద్యార్థుల రెజ్యూమ్‌లను ఇతర కంపెనీలకు పంపిస్తూ వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్లేస్‌మెంట్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు

ఐఐటీల నిర్ణయంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న కార్పొరేట్ కంపెనీలకు ఇది తగిన గుణపాఠమని, ఒరాకిల్ ఆఫర్లు రద్దు చేసిన అన్ని కాలేజీల్లోనూ ఇలాగే నిషేధం విధించాలని కొందరు మద్దతు తెలుపుతున్నారు. అయితే మరికొందరు మాత్రం ఈ నిర్ణయం ఐఐటీలకే ఎదురుదెబ్బ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఐఐటీల్లో మాత్రమే ప్రతిభ ఉందని భావించడం సరికాదని, కంపెనీలు ఇప్పుడు ఏఐ (AI) సహాయంతో నేరుగా బయట నుంచే నియామకాలు చేపడతాయని ఓ యూజర్ వ్యాఖ్యానించారు.

.”

ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతోందని, రెండేళ్ల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2022 కంటే ముందున్న స్థాయితో పోలిస్తే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ జాబ్ పోస్టింగ్స్ 36 నుంచి 49 శాతం తగ్గాయని, 2024 నుంచి ఫ్రెషర్ల నియామకాలు దాదాపు 20 శాతం పడిపోయాయని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. కాగా ఈ వార్త కేవలం సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా వైరల్ అవుతోందని, దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదని గమనించాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed