Last Updated:
అక్కినేని లెగసీని చెక్కు చెదరకుండా కంటిన్యూ చేస్తున్నాడు నాగ చైతన్య. అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, కింగ్ నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.
అక్కినేని లెగసీని చెక్కు చెదరకుండా కంటిన్యూ చేస్తున్నాడు నాగ చైతన్య. అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, కింగ్ నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన బృహస్పతి టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ 2026 కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా నాగ చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకుడు కేటీఆర్‌తో కలిసి తన వ్యాపార ప్రయాణం, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదురైన అనుభవాలు గురించి నాగ చైతన్య మాట్లాడారు.
జోష్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య.. ఫస్ట్ సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. కమర్షియల్‌గా ఈ సినిమా పెద్దగా ఆడలేదు కానీ.. నాగ చైతన్యకు మాత్రం సాలిడ్ డెబ్యూ పడింది. ఆ తర్వాత చేసిన ఏమాయ చేశావే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. ఈ సినిమాతో యూత్‌లో నాగ చైతన్యకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. 100% లవ్, తడాఖా, మనం, ఒక లైలా కోసం, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, మజిలి, లవ్ స్టోరీ, బంగార్రాజు ఇలా… ఆయన ఫిల్మోగ్రహిలో మంచి మంచి హిట్ సినిమాలున్నాయి.
ఇక గతేడాది రిలీజైన తండేల్ సినిమాతో ఏకంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఈ సినిమా నాగ చైతన్యకు తెచ్చిపెట్టిన క్రేజ్ అంతా ఇంతా కాదు. తన మార్కెట్‌ను కూడా మరో స్థాయికి తీసుకెళ్లింది ఈ సినిమా. ప్రస్తుతం ఈయన విరూపాక్ష దర్శకుడు కార్తిక్ దండూతో మిస్టరీ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు వృషకర్మ అనే టైటిల్‌ను లాక్ చేశారు. మీనాక్షీ చౌదరీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 4న విడుదల కాబోతుంది.














