Dimple Hayathi: ‘నారాయణమ్మ’ పాటలో డింపుల్ హయాతి.. త్రివిక్రమ్‌ను ‘గురూజీ’ అని ఎందుకు అంటారో తెలిసిందంటూ కామెంట్స్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం AK47’. వెంకటేశ్ తొలిసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

News18
News18

విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం AK47’. వెంకటేశ్ తొలిసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కుటుంబ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా చిత్రబృందం ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేసింది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ‘నారాయణమ్మ’ పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. తమన్ సంగీతం సమకూర్చారు. రామ్ మిరియాల, ప్రభా కలిసి ఈ పాటను ఆలపించారు. ఈ పాటలో హీరోయిన్ డింపుల్ హయాతి స్పెషల్ అప్పియరెన్స్‌తో సందడి చేశారు. పాట విడుదల కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డింపుల్ హయాతి తనకు ఈ స్పెషల్ సాంగ్ చేయడానికి గల కారణాలను వెల్లడించారు. ముఖ్యంగా దర్శకుడు త్రివిక్రమ్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కలిగించాయి. త్రివిక్రమ్‌ను ఇంతకుముందు తాను ఎప్పుడూ కలవలేదని, ఆయనతో తనకు ఎలాంటి పరిచయం లేదని డింపుల్ చెప్పారు. అయితే తొలిసారి ఆయనను కలిసినప్పుడే ప్రేక్షకులు ఆయనను ‘గురూజీ’ అని ఎందుకు పిలుస్తారో తనకు అర్థమైందని అన్నారు.

నటీనటులను త్రివిక్రమ్ ట్రీట్ చేసే విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందని డింపుల్ తెలిపారు. నటీనటులు చేసే చిన్న చిన్న పొరపాట్లను కూడా ఆయన వెంటనే గుర్తిస్తారని, సన్నివేశాన్ని ఎలా చేయాలో స్పష్టంగా అర్థమయ్యేలా వివరిస్తారని చెప్పారు. ఈ పాట చేయడానికి త్రివిక్రమ్ మొదటి కారణమైతే.. వెంకటేశ్ రెండో కారణమని డింపుల్ వెల్లడించారు. వెంకటేశ్‌తో కలిసి డ్యాన్స్ చేయడం ఎంతో ఎంజాయ్ చేశానని ఆమె చెప్పారు. నాలుగు రోజుల పాటు ఈ పాట షూటింగ్ జరిగిందని, ఆ నాలుగు రోజులు సెట్‌లో ఎంతో సరదాగా గడిచాయని తెలిపారు. తమన్ అందించిన సంగీతం కూడా అద్భుతంగా ఉందని డింపుల్ ప్రశంసించారు.

ఇదే కార్యక్రమంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వెంకటేశ్‌పై తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు. వెంకటేశ్ తన ఫేవరెట్ హీరో అని చెప్పిన ఆయన.. తన సినీ ప్రయాణంలో వెంకటేశ్‌కు ప్రత్యేక స్థానం ఉందని గుర్తుచేసుకున్నారు. తాను తొలిసారి డైలాగులు రాసిన సినిమా వెంకటేశ్ నటించిన ‘పవిత్ర బంధం’ అని త్రివిక్రమ్ తెలిపారు. ఆ సినిమాతో తన రచనా ప్రయాణం ప్రారంభమైనందుకు వెంకటేశ్‌కు ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటానని చెప్పారు. ఆ తర్వాత ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా సమయంలో వెంకటేశ్‌ను కలిశానని గుర్తుచేసుకున్నారు.

వెంకటేశ్‌పై తనకు గౌరవంతో కూడిన భయం ఉంటుందని త్రివిక్రమ్ అన్నారు. దాదాపు 75 సినిమాల తర్వాత కూడా ఆయన తన వృత్తిపై చూపిస్తున్న కమిట్‌మెంట్ ప్రత్యేకంగా ఉంటుందని ప్రశంసించారు. కాగా, ఈ కార్యక్రమానికి వెంకటేశ్, త్రివిక్రమ్, శ్రీనిధి శెట్టి, నివేథా పేతురాజ్, డింపుల్ హయాతి, తమన్, నిర్మాత చినబాబు తదితరులు హాజరయ్యారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, సంగీతం, వినోదానికి ప్రాధాన్యం ఉన్నట్లు కనిపించింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed