ప్యాకేజీ వివరాల ప్రకారం, 2026 జూన్ 15 నుంచి భీమాశంకర్ జ్యోతిర్లింగ ఆలయంలో పర్యాటకులు, భక్తులకు దర్శనం అందుబాటులో ఉంటుంది. అయితే ఆలయ ప్రాంగణంలోని సభామండపం, మెట్ల వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుంది. ఈ సమయానికి అనుగుణంగానే భీమాశంకర్ దర్శనం పూర్తయ్యేలా టూర్ షెడ్యూల్‌ను రూపొందించారు. ప్యాకేజీ ధరలు చూస్తే జీఎస్‌టీతో కలిపి ఒక్కో పెద్ద వ్యక్తికి ప్యాకేజీ ధర స్లీపర్ క్లాస్‌లో రూ.18,000. 3ఏసీలో రూ.27,400, 2ఏసీలో రూ.35,500గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు స్లీపర్ క్లాస్‌లో రూ.16,700, 3ఏసీలో రూ.25,900, 2ఏసీలో రూ.33,600 చెల్లించాలి. భారత్ గౌరవ్ ట్రైన్ పథకం కింద రైలు టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ఇండియన్ రైల్వేస్ ఇచ్చే సుమారు 33 శాతం రాయితీని ఈ ప్యాకేజీలో కలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)














