ప్రభుత్వ ఆస్పత్రిలో బిడ్డ పుడితే బంగారు ఉంగరం.. కొత్త పథకం ప్రారంభించిన సీఎం విజయ్ | | ACTPnews

News18


Last Updated:

సీఎం విజయ్ తన ఎన్నిక హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా ఆయన ప్రారంభించిన పథకం అందరిని ఆలోచిపంజేస్తుంది…. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి…

News18
News18

తమిళనాడులో ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జన్మించే శిశువులకు బంగారు ఉంగరం అందించే ‘తాయిమామ బంగారు ఉంగరం’ పథకం ప్రారంభమైంది. మదురై రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలో ముఖ్యమంత్రి విజయ్ ఈ పథకాన్ని ప్రారంభించారు. 30 మంది తల్లిదండ్రుల సమక్షంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విరుదునగర్ ఎంపీ మాణిక్కం ఠాగూర్, మదురై ఎంపీ సు. వెంకటేశన్, మంత్రులు ఆనంద్, నిర్మల్ కుమార్, అరుణ్ రాజ్ తదితరులు హాజరయ్యారు.

ఎన్నికల హామీగా ప్రకటించిన పథకం

శాసనసభ ఎన్నికల సమయంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే తమిళనాడులో జన్మించే పిల్లలకు బంగారు ఉంగరం అందించే పథకాన్ని అమలు చేస్తామని విజయ్ ప్రకటించారు. ఈ పథకానికి ‘తాయిమామ బంగారు ఉంగరం’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసే క్రమంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ వైద్యసేవల పరిధిలో ప్రసవించే కుటుంబాలకు దీని ద్వారా ప్రయోజనం అందనుంది.

ఎవరెవరు అర్హులు?

ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేశారు. వాటి ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రులు లేదా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శిశువు జన్మించి ఉండాలి. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించే గర్భిణులు ఈ పథకానికి అర్హులు. అయితే వారు ప్రసూతి, శిశు ఆరోగ్య నమోదులో తమ వివరాలను నమోదు చేసుకుని ఉండాలి. అలాగే వారు తమిళనాడుకు చెందినవారై ఉండటం తప్పనిసరి.

ఏ పత్రాలు ఉంటే సరిపోతుంది?

తమిళనాడుకు చెందినవారనే విషయాన్ని నిర్ధారించేందుకు రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, కార్మిక సంక్షేమ మండలి జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా నివాస ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకదాన్ని చూపిస్తే సరిపోతుంది. ఈ పథకంలో మొదటి బిడ్డ, రెండో బిడ్డ, మూడో బిడ్డ అంటూ ఎలాంటి తేడా ఉండదు. అర్హత కలిగిన కుటుంబాల్లో పుట్టిన ప్రతి శిశువుకు బంగారు ఉంగరం అందిస్తారు.

ప్రత్యేకంగా దరఖాస్తు అవసరం లేదు

ఈ పథకం కోసం తల్లిదండ్రులు ప్రత్యేకంగా ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో లేదా నేరుగా వెళ్లి దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం కూడా లేదని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 22 నుంచి జన్మించిన శిశువులకు పథకం కింద బంగారు ఉంగరాలు అందించనున్నారు. జూన్ 22 నుంచి సెప్టెంబర్ 27 వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన పిల్లలను కూడా పథకం పరిధిలోకి తీసుకురానున్నారు.

107 ప్రత్యేక కేంద్రాల్లో పంపిణీ

తమిళనాడు వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 107 ప్రత్యేక పంపిణీ కేంద్రాల ద్వారా అర్హులైన శిశువులకు బంగారు ఉంగరాలను అందించనున్నారు. జూన్ 22 నుంచి సెప్టెంబర్ 27 మధ్య ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన పిల్లలకు ఈ కేంద్రాల ద్వారా ఉంగరాల పంపిణీ చేపట్టనున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే కుటుంబాలకు నేరుగా ప్రయోజనం అందేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed