Asian Games 2026: గురి అదిరింది.. ఆసియా గేమ్స్‌లో మహిళల ఆర్చరీ జట్టు ప్రభంజనం..ప్రపంచ రికార్డు సమం! | క్రీడా వార్తలు | ACTPnews

భారత ఆర్చరీ టీమ్


Last Updated:

Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు అద్భుత ప్రదర్శనతో మెరిసింది.

భారత ఆర్చరీ టీమ్
భారత ఆర్చరీ టీమ్

బుధవారం జరిగిన ఫైనల్లో చైనా జట్టును చిత్తు చేస్తూ స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా, ప్రపంచ రికార్డు స్కోరును సమం చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. జ్యోతి సురేఖ వెన్నం, చికిత తనిపర్తి, ప్రీతిక ప్రదీప్‌‌లతో కూడిన భారత త్రయం ఫైనల్లో ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో చైనాపై 238-234 పాయింట్ల తేడాతో విజయం సాధించి పోడియంపై అగ్రస్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయంతో భారత ఆర్చర్లు కొరియా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేశారు. ఈ విభాగంలో వునియర్, యువా వాంగ్, ఫాంగ్‌యావో వీలతో కూడిన చైనా జట్టు రజత పతకాన్ని దక్కించుకోగా, చైనీస్ తైపీ జట్టుపై గెలిచిన దక్షిణ కొరియా త్రయం (పార్క్ జుంగ్యూన్, పార్క్ యేరిన్, కాంగ్ యోన్సియో) కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.

ఫైనల్ మ్యాచ్ ఆరంభం నుంచే భారత క్రీడాకారిణులు అద్భుతమైన గురితో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. వరుసగా పర్ఫెక్ట్ 10లను సంధిస్తూ తొలి ఎండ్‌ను 60-58తో కైవసం చేసుకున్నారు. అదే జోరును కొనసాగిస్తూ రెండో ఎండ్‌ను కూడా 60-58తో గెలుచుకుని తమ ఆధిక్యాన్ని పెంచుకున్నారు. మూడో రౌండ్ ముగిసే సమయానికి 178-176తో భారత్ ఆధిక్యంలో నిలిచింది.

చివరిదైన నాలుగో ఎండ్‌లో ఒత్తిడికి లోనైన చైనా రెండు బాణాలను 9 పాయింట్లకు మాత్రమే సంధించింది. మరోవైపు భారత ఆర్చర్లు ఏమాత్రం తడబడకుండా వరుసగా ఆరు బాణాలను పర్ఫెక్ట్ 10లకు గురిపెట్టి ప్రపంచ రికార్డును సమం చేయడంతో పాటు ఛాంపియన్ టైటిల్‌ను నిలబెట్టుకున్నారు.

నగోయాలోని ఒకజాకి చువో సొగో పార్క్‌లో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో దక్షిణ కొరియాపై 234-233 తేడాతో విజయం సాధించి భారత్ ఫైనల్‌‌కు చేరుకుంది. అంతకుముందు 2023లో జరిగిన హాంగ్జౌ ఆసియా క్రీడల్లోనూ భారత మహిళల కాంపౌండ్ జట్టు స్వర్ణం సాధించగా, ఆ ఎడిషన్‌లో ఆర్చరీ విభాగంలో భారత్‌కు మొత్తం ఐదు స్వర్ణాలు దక్కాయి. తాజా విజయంతో ప్రస్తుత ఆసియా క్రీడల్లో భారత ఖాతాలో ఏడో స్వర్ణ పతకం చేరింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed