Last Updated:
ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ, అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అనసూయ.. తాజాగా తన జిమ్ ఫొటోస్, వీడియోస్ వదిలి మరోసారి రచ్చ షురూ చేశారు.
బుల్లితెరపై యాంకర్‌గా ప్రయాణం మొదలుపెట్టి, వెండితెరపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న నటి అనసూయ భరద్వాజ్. వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని అందంతో కుర్రకారును కట్టిపడేస్తున్న ఈ గ్లామర్ బ్యూటీ, తాజాగా నెట్టింట ఓ వీడియోతో సెగలు పుట్టిస్తున్నారు. జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తూ, చెమటలు చిందిస్తున్న ఆమె వర్కవుట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ, అదే ఫిజిక్ మెయింటైన్ చేయడం వెనుక ఉన్న ఆమె కష్టం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆమె జిమ్ ఫొటోస్, వీడియోస్ చూసి కుర్రాళ్ళు పరేషాన్ అవుతున్నారు. ఒకప్పుడు శారీలో, షార్ట్ దుస్తుల్లో అందాలు ఆరబోయే అనసూయ.. ఇప్పుడు జిమ్ వేర్ లో కూడా మంటలు పుట్టిస్తోంది అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు నెటిజన్లు.
ఫిట్నెస్ పట్ల తనకున్న డెడికేషన్‌ను రీసెంట్ గానే ఓ వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు అనసూయ. “ఉదయాన్నే నిద్రలేచి వర్కవుట్ చేయడం అంత సులభమైన విషయం కాదు. చాలామంది ‘ఇవాళ వద్దులే, రేపు చేద్దాం’ అని సాకులు చెబుతూ వాయిదా వేస్తుంటారు. కానీ ఒక్కసారి జిమ్ చేయడం మొదలుపెడితే ఆ కిక్కే వేరు.. అసలు ఆపలేరు” అంటూ తనదైన స్టైల్లో ఎనర్జిటిక్‌గా చెప్పుకొచ్చారు. ప్రతిరోజూ మన ఆరోగ్యకరమైన, అందమైన శరీరం కోసం కనీసం గంట లేదా గంటన్నర సమయం కేటాయించాలని ఆమె నెటిజన్లకు సూచించారు. జిమ్ సూట్లో స్టన్నింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న అనసూయ.. వెయిట్ లిఫ్టింగ్, స్కిప్పింగ్ చేస్తూ తన ఫిట్నెస్ సీక్రెట్స్‌ను కళ్లకు కట్టారు. ముఖ్యంగా మహిళలకు లోయర్ బాడీ ఫిట్నెస్ ఎంత అవసరమో వివరిస్తూ.. పెల్విక్ ఏరియా, ఇన్నర్ థైస్ దృఢత్వం కోసం తాను చేసే ప్రత్యేకమైన వ్యాయామాలను చేసి చూపించారు.
‘జబర్దస్త్’ షోతో విశేష ప్రజాదరణ పొందిన అనసూయ.. ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘క్షణం’ లాంటి చిత్రాలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’లో డీగ్లామరైజ్డ్ ‘రంగమ్మత్త’ పాత్ర ఆమె కెరీర్‌ను కీలక మలుపు తిప్పింది. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’, ‘పుష్ప 2’ చిత్రాల్లో దాక్షాయణిగా పవర్ఫుల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ఆస్కారం ఉన్న వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు.
ఇటీవల ‘నాగబంధం’ సినిమాలో లీలావతిగా ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ‘పుష్ప 3’ తో పాటు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘వుల్ఫ్’, ‘ది చేజ్’ వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.














