MI vs RR: ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్.. ముంబైపై గ్రాండ్ విక్టరీ | క్రీడా వార్తలు | ACTPnews

credit: x


Last Updated:

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది, ముంబై ఇండియన్స్‌పై 30 పరుగుల తేడాతో గెలుపు, సూర్యకుమార్ యాదవ్ 60 పరుగులు చేసినా ముంబై 206 టార్గెట్ చేజ్ విఫలం.

credit: x
credit: x

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ 30 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్.. ముంబైకి 206 పరుగుల టార్గెట్ సెట్ చేసింది. భారీ ఛేజింగ్‌కు దిగిన ముంబై.. ఓపెనర్లు రోహిత్ శర్మ (0), ర్యాన్ రిక్కల్టన్ (12), నమన్ ధిర్ (6), తిలక్ వర్మ (3).. ఇలా టాప్ ఆర్డర్ బ్యాటర్లు నిరాశపరిచారు. కానీ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 42 బంతుల్లో 60 (3 ఫోర్లు, 4 సిక్సులు) ఆడి ముంబై తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సూర్యకు తోడు విల్ జాక్స్ (3 ఫోర్లు, 2 సిక్సులు), హార్దిక్ పాండ్యా 34 (3 ఫోర్లు, 2 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడినా.. చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో టార్గెట్ రీచ్ అవ్వలేకపోయారు.

రాజస్థాన్ బ్యాటింగ్ ఇలా..

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్ఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు సాధించింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ (2).. ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. మరో ఓపెనర్ జైశ్వాల్ 27 (1 ఫోర్, 3 సిక్సులు) వేగంగా పరుగులు బాదాడు. ఆ తర్వాత వచ్చిన ధ్రువ్ జురెల్ 38 (3 ఫోర్లు, 2 సిక్సులు), దసున్ శనక 29 (3 సిక్సులు) కాస్త పర్వాలేదనిపించినా.. కెప్టెన్ పరాగ్ (14), ఫెరేరా (18), శుభమ్ దూబే (5) తక్కువ పరుగులకే ఔటయ్యారు. ఐతే వరుస క్రమంలో వికెట్లు కోల్పోయినా.. వచ్చిన ప్రతి బ్యాటర్ వేగంగా పరుగులు సాధించి, వెనుదిరిగారు.

ఇక చివర్లో జోఫ్రా ఆర్చర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 15 బంతుల్లో 32 (1 ఫోర్, 3 సిక్సులు) పరుగులు బాదాడు. చివర్లో జడేజా 19 (3 ఫోర్లు) వరుసగా బౌండరీలు సాధించడంతో రాజస్థాన్ స్కోర్ 205 చేరుకుంది. ఇక ముంబై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. విల్ జాక్స్, ఘజన్‌ఫర్, కార్బిన్ బాష్ చెరో వికెట్ తీసుకున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *