YS Jagan: రాష్ట్రంలో కుంటుపడిన ఉపాధి హామీ పథకం.. అంతా కూటమి ప్రభుత్వం పుణ్యమేనని జగన్ విమర్శ | ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వార్తలు (Andhra Pradesh Politics) | ACTPnews

YS Jagan


Last Updated:

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని చెప్పుకుంటోంది. రాష్ట్రానికి పెట్టుబడులు, కేంద్రం నుంచి సహాయ, సహకారాలు, కేటాయింపులు మెండుగా ఉన్నాయని చెప్పుకుంటున్న సమయంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వ పాలనపై, తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు ఏమాత్రం ఉపయోగంగా లేవని ఆరోపిస్తున్నారు.

YS Jagan
YS Jagan

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని చెప్పుకుంటోంది. రాష్ట్రానికి పెట్టుబడులు, కేంద్రం నుంచి సహాయ, సహకారాలు, కేటాయింపులు మెండుగా ఉన్నాయని చెప్పుకుంటున్న సమయంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వ పాలనపై, తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు ఏమాత్రం ఉపయోగంగా లేవని, అందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలవుతున్న తీరే నిదర్శనమని సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ (ఎక్స్)ద్వారా ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. గడిచిన రెండున్నర ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో (MGNREGA)పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. ప్రభుత్వం అనవసరమైన వాటికి ప్రాధాన్యతను ఇస్తూ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు జీవనాధారమైన మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. దీనికి తగిన విధంగా రెండేళ్లుగా ఆ పథకం తీరుతెన్నులను ఉదహరిస్తూ లెక్కలను కూడా పంచుకున్నారు వైఎస్ జగన్.

కూటమి పాలనపై జగన్ ఆరోపణలు..

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జీవనాధారమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఫలితంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయి, ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆదాయాన్ని పెంచడంలో ఉపాధి హామీ పథకం అత్యంత కీలకమని జగన్ పేర్కొన్నారు. చారిత్రకంగా ఈ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉండేదని, కానీ గత రెండేళ్ల టీడీపీ కూటమి పాలనలో రాష్ట్రం వెనుకబడిపోయిందని విమర్శించారు.

తీరు మార్చుకోండి బాబు..

ఆమోదించిన లేబర్ బడ్జెట్, పథకం కింద పనిచేసిన కుటుంబాల సంఖ్య, మొత్తం వ్యయం వంటి అన్ని కొలమానాల్లోనూ పనితీరు గణనీయంగా తగ్గిపోయిందని ఆయన వివరించారు. ఈ ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోందని జగన్ తెలిపారు. గత రెండేళ్లుగా జీఎస్టీ, అమ్మకం పన్ను వసూళ్లు మందగించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. “టీడీపీ కూటమి ప్రభుత్వం అవినీతి, సంపదపై ఉన్న యావతోనే నిమగ్నమై ఉంది. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టే సమయం వారికి లేదు” అని జగన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తన ప్రాధాన్యతలను మార్చుకొని, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *