Flydubai Indian Pilot: ఫ్లైదుబాయ్ విమానంలో నెత్తురోడిన భారత పైలట్.. బయటపడ్డ షాకింగ్ వీడియో! | | ACTPnews

News18


Last Updated:

దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ జరిపిన కత్తి దాడిని అడ్డుకున్న భారత కెప్టెన్ స్మిత్ మచ్చార్ తొలి దృశ్యాలు బయటపడ్డాయి. తీవ్ర గాయాలతోనే ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన ఆయనను ప్రధాని మోదీ నిజమైన హీరోగా కొనియాడారు.

News18
News18

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరానికి 174 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫ్లైదుబాయ్ (FlyDubai) ఎఫ్‌జెడ్-1073 విమానంలో ఘోర విపత్తును నివారించిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ తొలి దృశ్యాలు గురువారం బయటపడ్డాయి. విమానం గాల్లో ఉండగానే ఒమన్ దేశస్థుడైన కో-పైలట్ అకస్మాత్తుగా కత్తితో దాడి చేసి విమానాన్ని కూల్చేందుకు యత్నించాడు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావమైనప్పటికీ కెప్టెన్ మచ్చార్ ఎదురొడ్డి పోరాడారు. విమానం కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే దాదాపు 14,000 అడుగుల మేర శరవేగంగా కిందికి పడిపోయింది.

ఆ క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రాణాలకు తెగించిన కెప్టెన్ కాక్‌పిట్ డోర్ లాక్‌ను తెరవడంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వచ్చి దాడి చేసిన కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ఉన్న మరో ఇద్దరు పైలట్ల సాయంతో విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారు.

తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స

న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. బయటకు వచ్చిన వీడియో దృశ్యాలలో కెప్టెన్ మచ్చార్ మెడ, ఛాతీ, కడుపు, భుజం భాగాలపై కత్తిపోట్లతో కూడిన తీవ్ర గాయాలు కనిపించాయి. తొలుత ఆయనకు సౌదీ అరేబియాలోని ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందించారు. అక్కడ పరిస్థితి నిలకడగా మారిన తర్వాత మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక ఎయిర్‌లిఫ్ట్ ద్వారా దుబాయ్ తరలించారు. ఈ దాడి వెనుక గల అసలు కారణాలపై భద్రతా సంస్థలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.

కెప్టెన్ ధైర్యాన్ని కొనియాడిన మోదీ, నెతన్యాహు

భారత పైలట్ ప్రదర్శించిన సాహసాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రశంసించారు. ప్రాణాపాయ స్థితిలోనూ అసాధారణ ధైర్యసాహసాలు చూపి పెను ముప్పును తప్పించారని, ఆయన నిజమైన హీరో అని పేర్కొంటూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా స్మిత్ మచ్చార్ సమయస్ఫూర్తిని ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. విమాన ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత పైలట్ తెగువ అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports