Hyderabad: కోకాపేటలో కిరాతకం.. క్రికెట్ బ్యాట్‌‌తో తల పగలగొట్టి.. | తెలంగాణ వార్తలు | ACTPnews

Hyderabad


Last Updated:

Hyderabad: హైదరాబాద్‌లో నేరాలు జరుగుతున్న తీరు ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. వ్యక్తిగత పగలు, ఆర్ధిక లావాదేవీలు, వివాహేతర సంబంధాలు కారణంతో అత్యంత దారుణంగా హత్యలు చేస్తున్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకన్న అనే యువకుడ్ని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు.

Hyderabad
Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో నేరాలు జరుగుతున్న తీరు ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. వ్యక్తిగత పగలు, ఆర్ధిక లావాదేవీలు, వివాహేతర సంబంధాలు కారణంతో అత్యంత దారుణంగా హత్యలు చేస్తున్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకన్న అనే యువకుడ్ని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. కోకాపేట్ నియో పోలీస్ ప్రాంతంలోని కారులో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు మృతుడు ఖమ్మం జిల్లాకు చెందిన వెంకన్నగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేయడానికి గల కారణాలు ఏమై ఉంటాయనే కోణంలో విచారణ జరుపుతున్నారు నార్సింగి పోలీసులు.

లగ్జరీ లొకేషన్‌లో మర్డర్..

హైదరాబాద్ అత్యంత ఖరీదైన ప్రాంతం కోకాపేటలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నియో పోలీస్ కురుమ సంఘం భవనం వద్ద కారులో మృతదేహం ఉండటాన్ని గమనించిన పోలీసులు స్పాట్‌కి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతుడిని క్రికెట్ బ్యాట్‌తో తలపై బలంగా కొట్టి చంపినట్లుగా నార్సింగి పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు ఖమ్మం జిల్లాకు చెందిన వెంకన్నగా గుర్తించారు. అయితే అతడ్ని ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేసినట్లుగా భావిస్తున్నారు పోలీసులు.

క్రికెట్ బ్యాట్‌తో కొట్టి..

మృతుడు వెంకన్న ఉస్మానియా క్యాంపస్‌లో ఉంటూ పీహెచ్‌డీ చేస్తున్నట్లుగా ఆధారాలను సేకరించారు. అంతే కాదు వెంకన్నకు వివాహమైంది. భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఘటన స్థలంలో లభించిన క్లూస్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నామని డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు.

కారులో డెడ్ బాడీ కలకలం..

వెంకన్న మర్డర్ కేసు స్థానికంగా కలకలం రేపింది. ఈ హత్యకు ఆర్ధిక లావాదేవీలే కారణమా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు. ఇక కారు నెంబర్ ఆధారంగా పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇటీవల నగర శివార్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం, భూ వివాదాలు కారణంతో అనేక హత్యలు జరుగుతున్నాయి. పోలీసుల ఆ కోణంలో కూడా వెంకన్న మర్డర్ కేసును చేధించే పనిలో పడ్డారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed