Last Updated:
నేచురల్ స్టార్ నాని, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఓటీటీ ఎంట్రీకి సిద్దమవుతోంది.
నేచురల్ స్టార్ నాని, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. మొదటి రోజే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ, నాని అద్భుతమైన నటన, శ్రీకాంత్ ఓదెల టేకింగ్, అదిరిపోయే యాక్షన్ ఎలిమెంట్స్ మాస్ ఆడియన్స్ను థియేటర్లకు రప్పిస్తున్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘దసరా’ పాన్ ఇండియా స్థాయిలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అదే అంచనాలతో వచ్చిన ‘ది ప్యారడైజ్’ కూడా కమర్షియల్గా నిర్మాతలకు లాభాలను చేకూర్చే దిశగా అడుగులు వేస్తోంది.
ఒకవైపు థియేటర్లలో సినిమా లాంగ్ రన్ కొనసాగిస్తుండగా, మరోవైపు మూవీ టీమ్ ప్రమోషన్స్ వేగం పెంచింది. రిలీజ్ తర్వాత కూడా నాని, శ్రీకాంత్ ఓదెల వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. అలాగే ఆధ్యాత్మిక పర్యటనలతోనూ చిత్ర బృందం వార్తల్లో నిలుస్తోంది. వరంగల్ మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకున్న మూవీ టీమ్, ఆ తర్వాత విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం కొన్ని ప్రధాన కేంద్రాల్లో సక్సెస్ఫుల్గా నడుస్తున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఇంటర్నెట్లో ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది.
థియేటర్లలో మిస్ అయిన సినీ ప్రియులు ‘ది ప్యారడైజ్’ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ ‘నెట్ఫ్లిక్స్’ (Netflix) భారీ ధరకు సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ పూర్తిగా ముగిసిన తర్వాతే ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. సాధారణంగా ఇప్పుడున్న అగ్రిమెంట్స్ ప్రకారం, ఒక సినిమా థియేటర్లలో విడుదలైన 6 నుంచి 8 వారాల తర్వాత మాత్రమే ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే, సెప్టెంబర్ 24న థియేటర్లలోకి వచ్చిన ‘ది ప్యారడైజ్’.. నవంబర్ మొదటి వారం నుంచి మూడో వారం మధ్యలో డిజిటల్ ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.
అంటే నవంబర్ 5 నుంచి నవంబర్ 19 తేదీల మధ్య ఎప్పుడైనా ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ థియేట్రికల్ రన్ అనుకున్నదానికంటే ముందే ముగిస్తే, నవంబర్ మొదటి వారంలోనే సర్ ప్రైజ్ స్ట్రీమింగ్ ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, కచ్చితమైన స్ట్రీమింగ్ తేదీ విషయంలో మేకర్స్ లేదా నెట్ఫ్లిక్స్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.














