IPL 2026 Playoffs: ప్లేఆఫ్స్‌కు రంగం సిద్ధం.. క్వాలిఫయర్‌లో ఆర్సీబీ వర్సెస్ గుజరాత్.. ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌తో SRH ఢీ.. | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ముంబై ఇండియన్స్‌పై 30 పరుగుల తేడాతో గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసులో చివరి స్థానాన్ని దక్కించుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు టోర్నీ నుండి అధికారికంగా నిష్క్రమించాయి.

News18
News18

ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్ రేసు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో టాప్-4 లో నిలిచి చివరి ప్లేఆఫ్స్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లతో తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ, రాజస్థాన్ అద్భుత ప్రదర్శనతో ఆ రెండు జట్లను రేసు నుండి పూర్తిగా తప్పించింది. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లతో కలిసి రాజస్థాన్ రాయల్స్ నాకౌట్ దశకు చేరుకోవడంతో ఈ సీజన్ లీగ్ మ్యాచ్‌ల ఉత్కంఠ ముగిసింది.

ఆర్చర్ సంచలన ప్రదర్శన – ముంబై ఓటమి

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో కేవలం 15 బంతుల్లోనే 32 పరుగులు బాదడమే కాకుండా, బౌలింగ్‌లో 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 205 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ 175 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 60 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు.

Rank Team Won Lost Points NRR
1 RCB 9 5 18 0.783
2 GT 9 5 18 0.695
3 SRH 9 5 18 0.524
4 RR 8 6 16 0.189
ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఖరారు

మే 26 తేదీన ధర్మశాల వేదికగా జరిగే క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రెండో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఆ తర్వాత మే 27 తేదీన ముల్లాన్‌పూర్‌లో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో మూడో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో నాలుగో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఢీకొంటుంది. ఇందులో ఓడిన జట్టు టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది.

ఫైనల్ వేదిక మార్పు

ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు, క్వాలిఫైయర్-1 లో ఓడిన జట్టుతో మే 29 తేదీన ముల్లాన్‌పూర్‌లోనే క్వాలిఫైయర్-2 మ్యాచ్ ఆడుతుంది. ఇందులో విజేతగా నిలిచిన జట్టు మే 31 తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే గ్రాండ్ ఫైనల్‌లో టైటిల్ కోసం పోరాడుతుంది. నిజానికి ఈ ఏడాది ఫైనల్ మ్యాచ్ బెంగళూరులో జరగాల్సి ఉన్నప్పటికీ, కొన్ని స్థానిక భద్రతా కారణాల వల్ల బీసీసీఐ ఈ వేదికను అహ్మదాబాద్‌కు మారుస్తూ గతంలోనే నిర్ణయం తీసుకుంది.

Match Fixture Date Venue
Qualifier 1 RCB vs GT May 26, 2026 Dharamsala
Eliminator SRH vs RR May 27, 2026 Mullanpur
Qualifier 2 Winner of Eliminator vs Loser of Qualifier 1 May 29, 2026 Mullanpur
Final Winner of Qualifier 1 vs Winner of Qualifier 2 May 31, 2026 Ahmedabad

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports