Penthouse Tragedy: బాత్‌రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. రెండు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘటన | | ACTPnews

News18


Last Updated:

Penthouse Tragedy: హైదరాబాద్ యూసుఫ్‌గూడలో మెహందీ డిజైనర్ ఇడుపల్లి హరిత బాత్‌రూమ్‌లో మృతదేహంగా లభ్యం, అనారోగ్యంతో మృతి అనుమానం, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

News18
News18

హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో ఒక విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఒక మెహందీ డిజైనర్ తన నివాసంలోని బాత్‌రూమ్‌లో విగతజీవిగా పడి ఉండటం కలకలం సృష్టించింది. ఒంటరిగా నివసిస్తున్న ఆమె, అనారోగ్య సమస్యల వల్ల మరణించి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఈనాడు కథనం ప్రకారం విజయవాడకు చెందిన ఇడుపల్లి హరిత (36) గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఆమె వృత్తిరీత్యా మెహందీ డిజైనర్‌గా పనిచేస్తూ తన జీవనాన్ని సాగిస్తున్నారు. మధురానగర్‌లోని ఒక లేడీస్ హాస్టల్ నిర్వహిస్తున్న ఐదంతస్తుల భవనంపై ఉన్న పెంట్‌హౌస్‌లో ఆమె గత మూడేళ్లుగా ఒంటరిగా ఉంటున్నారు.

హరిత గత రెండు రోజులుగా బయట ఎక్కడా కనిపించలేదు. అలాగే ఆమె నివసిస్తున్న పెంట్‌హౌస్ నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో స్థానికులకు అనుమానం కలిగింది. హాస్టల్ నిర్వాహకుడు శివరామకృష్ణ బుధవారం సాయంత్రం పెంట్‌హౌస్‌కు వెళ్లి పరిశీలించారు. అక్కడ బాత్‌రూమ్‌లో హరిత మృతదేహం విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు.

వెంటనే శివరామకృష్ణ 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. మధురానగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో హరిత గత కొంతకాలంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది.

హరిత గత కొన్ని ఏళ్లుగా థైరాయిడ్, లివర్ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఆమె ఈ నెల 11వ తేదీనే బాత్‌రూమ్‌లో పడిపోయి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. రెండు రోజుల పాటు మృతదేహం అక్కడే ఉండటం వల్లే దుర్వాసన వచ్చిందని అంచనా వేస్తున్నారు.

పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. రిపోర్టు వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed