తొలి అణుబాంబుకు చేరువలో ఇరాన్? ఒప్పందం రద్దు దిశగా టెహ్రాన్.. పశ్చిమ దేశాల్లో తీవ్ర ఆందోళన! | | ACTPnews

News18


Last Updated:

అమెరికా, ఇజ్రాయెల్‌తో తీవ్ర ఉద్రిక్తతల వేళ అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) నుంచి తప్పుకునే అంశాన్ని ఇరాన్ పార్లమెంట్ పరిశీలిస్తోంది. 60 శాతం మేర యూరేనియం శుద్ధిని ఎట్టి పరిస్థితుల్లో ఆపబోమని టెహ్రాన్ స్పష్టం చేసింది.

News18
News18

అంతర్జాతీయ సమాజంతో దశాబ్దాలుగా కొనసాగుతున్న అణ్వాయుధ వివాదంలో ఇరాన్ అత్యంత కీలకమైన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ) నుంచి వైదొలగే అవకాశాలను ఇరాన్ పార్లమెంట్ త్వరలోనే పరిశీలించనుందని ఆ దేశ పార్లమెంట్ బోర్డు సభ్యుడు అలీరెజా సలీమీ సంచలన ప్రకటన చేశారు. ఈ ఒప్పందం నుంచి తప్పుకున్నప్పటికీ యూరేనియం శుద్ధి ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించుకోబోమని ఆయన తేల్చిచెప్పినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. ఇప్పటికే చట్టబద్ధంగా అమల్లో ఉన్న 60 శాతం యూరేనియం శుద్ధిని యథావిధిగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఇటీవల జరిగిన దాడుల్లో మరణించిన మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్యకు ప్రతికారం తీర్చుకుంటామని, అమెరికా, ఇజ్రాయెల్ అగ్రనేతలపై ప్రతీకార దాడులు తప్పవని ఇరాన్ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఒప్పందం నుంచి వైదొలగడం అంటే నేరుగా అణుబాంబు తయారీ కాకపోయినా, పశ్చిమ దేశాలతో వివాదం పతాక స్థాయికి చేరింది.

హోర్ముజ్ జలసంధి మూసివేత.. అమెరికా బలగాల మోహరింపు

ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ వంటి హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో సంక్షోభం మరింత ముదిరింది. ప్రపంచ చమురు, సహజవాయువు రవాణాలో కీలకమైన ఈ మార్గాన్ని తిరిగి తెరవాలంటే తాము విధించిన షరతులను వాషింగ్టన్ అంగీకరించాల్సిందేనని టెహ్రాన్ పట్టుబడుతోంది. చర్చలు నిలిచిపోవడంతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా ముప్పు పెరిగింది.

మరోవైపు ఇరాన్‌ను నిలువరించేందుకు అమెరికా మధ్యప్రాచ్యంలో భారీ సైనిక మోహరింపు చేపట్టింది. సుమారు 10,000 మంది అదనపు సైనికులు, మూడో ఎయిర్‌‌క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌తో పాటు నావికాదళ నౌకలను అమెరికా నవంబర్ నాటికి మోహరిస్తోంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం క్రమంగా గల్ఫ్ దేశాలకు విస్తరిస్తోంది. సెప్టెంబర్ ప్రారంభంలో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్, రాడార్లు, పోర్టులపై అమెరికా పెద్ద ఎత్తున క్షిపణి దాడులు నిర్వహించింది. ఈ తీవ్ర పరిణామాలు పశ్చిమాసియాను మరో పూర్తి స్థాయి మహా సంగ్రామం అంచున నిలబెట్టాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports