ఇటీవల ముగిసిన 2026 ఆసియా క్రీడల్లో పాకిస్థాన్ జట్టుకు సాహిబ్‌జాదా ఫర్హాన్ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఫైనల్లో భారత్ చేతిలో 19 పరుగుల తేడాతో ఓడినప్పటికీ జట్టు రజత పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు సల్మాన్ ఆఘా 2025 ఆసియా కప్‌కు ముందు జట్టు పగ్గాలు చేపట్టారు. ఆసియా కప్ ఫైనల్ ఓటమితో పాటు టీ20 వరల్డ్ కప్‌లో జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించడంతో ఆయన కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆధునిక టీ20లకు ఆయన బ్యాటింగ్ విధానం ఏమాత్రం సరిపోవడం లేదనే ప్రశ్నలు తలెత్తాయి. ప్రస్తుత జట్టులో ఫర్హాన్ మాత్రమే నిలకడగా రాణిస్తూ జట్టులో స్థిరమైన స్థానాన్ని దక్కించుకున్నారు.
శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసిన టీ20 జట్టును 2026 టీ20 ప్రపంచ కప్ జట్టుతో పోలిస్తే భారీ మార్పులు కనిపిస్తున్నాయి. బాబర్, ఆఘా, షాహిన్‌లతో పాటు ఫహీమ్ అష్రఫ్, మహ్మద్ నవాజ్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారిఖ్‌లను తప్పించారు. వీరి స్థానంలో అబ్దుల్ సమద్, అరాఫత్ మిన్హాస్, హసన్ నవాజ్, ముహమ్మద్ ఇమ్రాన్ రంధావా, మాజ్ సదాకత్, రజావుల్లా, మహ్మద్ సల్మాన్ మీర్జాలకు జట్టులో చోటు కల్పించారు.
సాహిబ్‌జాదా ఫర్హాన్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, అరాఫత్ మిన్హాస్, ఫఖర్ జమాన్, హసన్ నవాజ్, ముహమ్మద్ ఇమ్రాన్ రంధావా, ఖవాజా నఫే (వికెట్ కీపర్), మాజ్ సదాకత్, నసీమ్ షా, రజావుల్లా, సైమ్ అయూబ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, షాదాబ్ ఖాన్, సుఫియాన్ మోకిమ్.
ఆస్ట్రేలియాతో జరిగిన గత సిరీస్‌తో పోలిస్తే వన్డే జట్టులో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హసన్ నవాజ్, రజావుల్లా, సాద్ బేగ్‌లకు తిరిగి అవకాశం కల్పించారు. అబ్దుల్ సమద్, అహ్మద్ దానియల్, మాజ్ సదాకత్, రోహైల్ నజీర్, సాహిబ్‌జాదా ఫర్హాన్, షామిల్ హుస్సేన్‌లను వన్డే జట్టు నుంచి తప్పించారు.
షాహిన్ షా అఫ్రిది (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, సల్మాన్ అలీ ఆఘా, అరాఫత్ మిన్హాస్, బాబర్ అజామ్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ముహమ్మద్ ఘాజీ ఘోరి (వికెట్ కీపర్), హారిస్ రవూఫ్, హసన్ నవాజ్, నసీమ్ షా, రజావుల్లా, సాద్ బేగ్ (వికెట్ కీపర్), సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, సుఫియాన్ మోకిమ్.
ఈ పర్యటనకు షాన్ టైట్ బౌలింగ్ కోచ్‌గా, మైకేల్ స్మిత్ బ్యాటింగ్ కోచ్‌గా, మన్సూర్ అమ్జద్ ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తారు. ముహమ్మద్ తాహిర్ ఫిజియోథెరపిస్ట్‌గా, గ్రాంట్ లుడెన్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా సేవలందిస్తారు. శ్రీలంక టీ20 సిరీస్‌కు నబీల్ ఎడ్జర్ పేస్ డేటా అనలిస్ట్‌గా వ్యవహరించనుండగా, వన్డే ముక్కోణపు సిరీస్‌కు ఉస్మాన్ హష్మీ అనలిస్ట్ బాధ్యతలను నిర్వర్తించనున్నారు.













