Indian-3: ‘భారతీయుడు-3’ వచ్చేస్తుంది.. అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఒకప్పుడు ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో శంకర్‌ది ప్రత్యేకమైన స్థానం. భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్స్, సామాజిక అంశాలను కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మేళవించడం ఆయన సినిమాల ప్రత్యేకత.

News18
News18

ఒకప్పుడు ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో శంకర్‌ది ప్రత్యేకమైన స్థానం. భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్స్, సామాజిక అంశాలను కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మేళవించడం ఆయన సినిమాల ప్రత్యేకత. ముఖ్యంగా కమల్ హాసన్‌తో కలిసి చేసిన ‘భారతీయుడు’ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. అవినీతి, లంచాలపై తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని ప్రకటించినప్పుడు భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో ‘భారతీయుడు 2’ తెరకెక్కుతుందని తెలియగానే అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేయడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘భారతీయుడు 2’ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోవడంతో సినిమాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

అయితే ‘భారతీయుడు 2’పై వచ్చిన నెగెటివ్ టాక్‌తో ‘భారతీయుడు 3’పై ఆసక్తి మాత్రం పూర్తిగా తగ్గిపోలేదు. నిజానికి రెండో భాగంలో కంటే మూడో భాగంలోనే అసలు కథకు సంబంధించిన కీలక అంశాలు ఉంటాయని అప్పట్లో అభిమానుల్లో చర్చ జరిగింది. దీంతో ‘భారతీయుడు 3’ ఎలా ఉండబోతుందనే ఆసక్తి కొనసాగుతూనే ఉంది.

ఇదే సమయంలో ‘ఇండియన్ 3’ థియేటర్లలో విడుదల అవుతుందా? లేక నేరుగా ఓటీటీలోకి వస్తుందా? అనే చర్చ కూడా మొదలైంది. ‘భారతీయుడు 2’ తర్వాత మూడో భాగం విడుదలపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి. అసలు మూడో భాగం విడుదల కాకపోవచ్చనే కామెంట్లు కూడా వినిపించాయి.

అయితే ఇప్పుడు ఈ ప్రచారాలకు తెరదించుతూ మేకర్స్ నుంచి కీలక అప్డేట్ వచ్చినట్లు తెలుస్తోంది. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో ‘ఇండియన్ 3’ ఉందని మరోసారి స్పష్టత వచ్చింది. అంతేకాదు.. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం మిగిలిన షూటింగ్‌తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ పనులను పూర్తి చేయాల్సి ఉంది.

అంటే ‘ఇండియన్ 3’ పూర్తిగా ఆగిపోయిందనే వార్తలకు చెక్ పడినట్టే. అయితే మిగిలిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను మేకర్స్ ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? సినిమాను ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరోవైపు దర్శకుడు శంకర్‌ నుంచి కూడా అభిమానులు బలమైన కమ్‌బ్యాక్‌ను ఆశిస్తున్నారు. వరుస ప్రాజెక్టులు, భారీ అంచనాల మధ్య ఆయన తదుపరి సినిమాలపై కూడా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ‘ఇండియన్ 3’తో శంకర్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారనేది చూడాలి.

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ‘భారతీయుడు’ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా మూడో భాగంపై కూడా అంచనాలు ఉన్నాయి. మరి ఈసారి ఇండియన్ సేనాపతి ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తారో వేచి చూడాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports