INDIA Alliance Chalo Lok Bhavan Protest | చలో లోక్‌భవన్‌! మంత్రుల అరెస్ట్‌.. ఉద్రిక్తత | | ACTPnews

INDIA Alliance Chalo Lok Bhavan Protest


Last Updated: Oct 08, 2026, 18:58 IST

సర్ ప్రక్రియలో అవకతవకలకు నిరసనగా తెలంగాణలో ఇండీ కూటమి ఆధ్వర్యంలో ‘చలో లోక్భవన్’ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో భారీ నిరసన చేపట్టారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్, సీపీఐ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ర్యాలీ ప్రారంభమైన కొద్దిసేపటికే పోలీసులు జోక్యం చేసుకుని అడ్డుకున్నారు. నిరసనలో పాల్గొన్న మంత్రులు, పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్స్టేషన్కు తరలించారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
#INDIAAlliance #TelanganaPolitics #ChaloLokBhavan



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports