Last Updated:
ఈ రోజు (అక్టోబర్ 8) ఉదయం 5.20 గంటల ప్రాంతంలో తీవ్రమైన గుండెపోటుతో నానా పటేకర్ మరణించారు. దీంతో ఆయనకు సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ సినిమా స్థాయిని పెంచిన నటుల్లో నానా పటేకర్ ఒకరు. ఈయన యాక్టింగ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇండియన్ సినిమా హిస్టరీలో గొప్ప నటులు లిస్ట్ తీస్తే అందులో నానా పటేకర్ పేరు ముందు వరుసలో ఉంటుంది. తెలుగులో సినిమాలు చేయలేదు కానీ.. టాలీవుడ్ లో ఈయన పేరు తెలియని సినీ ప్రేమికుడు ఉండడు. దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఎన్నో డిఫరెంట్ రోల్స్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వచ్చాడు నానా పటేకర్. అయితే ఈ 75 ఏళ్ల సీనియర్ నటుడు ఈ రోజు (అక్టోబర్ 8) ఉదయం 5.20 గంటల ప్రాంతంలో తీవ్రమైన గుండెపోటుతో మరణించడంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గోవాలోని డోనా పౌలాలో ఉన్న ఆయన ఇంట్లో నానా పటేకర్ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయన అప్పటికే మరణించినట్లు ప్రకటించారు. నానా పటేకర్ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఆయన, చిత్ర పరిశ్రమకు అతీతంగా ప్రజా పోరాటాలలో గుర్తింపు పొందడం ద్వారా అనేక సందర్భాలలో తన సైద్ధాంతిక నిబద్ధతను ప్రదర్శించారు. అయితే, ఈ బహుభాషా నటుడు నానా పటేకర్ అసలు పేరు చాలా మందికి తెలియదు. ఆయన అసలు పేరు విశ్వనాథ్ పటేకర్ అయినప్పటికీ, నానా పటేకర్ అనే పేరుతోనే ఆయన కీర్తి గడించారు.
1978లో రిలీజైన ‘గమన్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాన పటేకర్ రచయితగా, దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. తెరపై ఎంత స్టార్‌డమ్ ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆయన చాలా సింపుల్‌గా ఉండటానికి ఇష్టపడతారని చెబుతుంటారు. నానా పటేకర్ ఆస్తుల విలువ సుమారు 10 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.72 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
పటేకర్ ‘క్రాంతి వీర్’ చిత్రానికి ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఆయన ‘పరిందా’, ‘అగ్నిసాక్షి’ చిత్రాలకు కూడా జాతీయ చలనచిత్ర పురస్కారాలను గెలుచుకున్నారు. 2013లో, భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించబడ్డారు.














